• సిరిసిల్ల జిల్లాలో గ్యాస్ సిలిండర్లకు కొరతలేదు వదంతులు, అసత్య ప్రచారాలు నమ్మవద్దు: సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్.

    సిరిసిల్ల జిల్లాలో గ్యాస్ సిలిండర్లకు కొరత లేదని కలెక్టర్ గరిమ అగ్రవాల్ స్పష్టం చేశారు. ఎనర్జీ మానిటరింగ్ కమిటీని శుక్రవారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సిలిండర్ల పంపిణీ, స్టాక్ తదితర అంశాలపై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో కమిటీ సభ్యులు, సిలిండర్ ఏజెన్సీల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఎనర్జీ మానిటరింగ్ కమిటీ జిల్లా చైర్మన్ గా కలెక్టర్, కన్వీనర్ గా జిల్లా పౌరసరఫరాల అధికారి, సభ్యులుగా వివిధ శాఖల అధికారులు ఉంటారని అధికారులు తెలిపారు.

    ఈ సందర్భంగా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా జిల్లాలో సిలిండర్ల నిల్వలు ఉన్నాయని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎలాంటి అపోహలు పడవద్దని, వదంతులు నమ్మవద్దని సూచించారు. గృహ వినియోగదారులు తమ అవసరాలకు అనుగుణంగా గ్యాస్ బుకింగ్ చేసుకోవాలని తెలిపారు. ప్రభుత్వ సూచించిన ధరలకు మాత్రమే సిలిండర్లను విక్రయించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ హాస్టళ్లు, స్కూళ్లు, అనాథ శ్రమాలు, ఆస్పత్రులకు ఇబ్బంది లేకుండా సిలిండర్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు.

    ఈ సందర్భంగా ఎస్పీ మహేష్ బి గితే మాట్లాడుతూ.. గ్యాస్ సిలిండర్లను పక్కదారి పట్టించవద్దని, బ్లాక్ దందా చేయవద్దని సూచించారు. సిలిండర్ పక్కదారి పట్టినా.. బ్లాక్ దందా చేసినట్లు తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

    సమావేశంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, జిల్లా పౌర సరఫరాల అధికారి రాధాభాయ్, సిరిసిల్ల ఆర్డీఓ వెంకటేశ్వర్లు, కమిటీ సభ్యులు రవీందర్ రెడ్డి, అఫ్జల్ బేగం, సౌజన్య, రూపేష్, లక్ష్మీరాజం, రజిత, గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

    #Sircilla #GasCylinder #sircillacollector #garimaagrawal #rajannasircilla #sircilla_rajanna_district
    సిరిసిల్ల జిల్లాలో గ్యాస్ సిలిండర్లకు కొరతలేదు వదంతులు, అసత్య ప్రచారాలు నమ్మవద్దు: సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్. సిరిసిల్ల జిల్లాలో గ్యాస్ సిలిండర్లకు కొరత లేదని కలెక్టర్ గరిమ అగ్రవాల్ స్పష్టం చేశారు. ఎనర్జీ మానిటరింగ్ కమిటీని శుక్రవారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సిలిండర్ల పంపిణీ, స్టాక్ తదితర అంశాలపై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో కమిటీ సభ్యులు, సిలిండర్ ఏజెన్సీల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఎనర్జీ మానిటరింగ్ కమిటీ జిల్లా చైర్మన్ గా కలెక్టర్, కన్వీనర్ గా జిల్లా పౌరసరఫరాల అధికారి, సభ్యులుగా వివిధ శాఖల అధికారులు ఉంటారని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా జిల్లాలో సిలిండర్ల నిల్వలు ఉన్నాయని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎలాంటి అపోహలు పడవద్దని, వదంతులు నమ్మవద్దని సూచించారు. గృహ వినియోగదారులు తమ అవసరాలకు అనుగుణంగా గ్యాస్ బుకింగ్ చేసుకోవాలని తెలిపారు. ప్రభుత్వ సూచించిన ధరలకు మాత్రమే సిలిండర్లను విక్రయించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ హాస్టళ్లు, స్కూళ్లు, అనాథ శ్రమాలు, ఆస్పత్రులకు ఇబ్బంది లేకుండా సిలిండర్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మహేష్ బి గితే మాట్లాడుతూ.. గ్యాస్ సిలిండర్లను పక్కదారి పట్టించవద్దని, బ్లాక్ దందా చేయవద్దని సూచించారు. సిలిండర్ పక్కదారి పట్టినా.. బ్లాక్ దందా చేసినట్లు తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, జిల్లా పౌర సరఫరాల అధికారి రాధాభాయ్, సిరిసిల్ల ఆర్డీఓ వెంకటేశ్వర్లు, కమిటీ సభ్యులు రవీందర్ రెడ్డి, అఫ్జల్ బేగం, సౌజన్య, రూపేష్, లక్ష్మీరాజం, రజిత, గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. #Sircilla #GasCylinder #sircillacollector #garimaagrawal #rajannasircilla #sircilla_rajanna_district
    0 Comments 0 Shares 455 Views 0 Reviews
  • ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన సిరిసిల్ల కలెక్టర్ గరిమ అగ్రవాల్.

    ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆకస్మిక తనిఖీ చేశారు. సిరిసిల్ల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఇంటర్ పరీక్ష కేంద్రంలో కలెక్టర్ తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు, కనీస వసతుల కల్పనను పరిశీలించి, అధికారులతో మాట్లాడారు.

    పరిశీలనలో తహసీల్దార్ మహేష్ కుమార్, అధ్యాపకులు, సిబ్బంది ఉన్నారు.

    #Sircilla #sircillacollector #garimaagrawal #rajannasircilla #sircilla_rajanna_district
    ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన సిరిసిల్ల కలెక్టర్ గరిమ అగ్రవాల్. ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆకస్మిక తనిఖీ చేశారు. సిరిసిల్ల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఇంటర్ పరీక్ష కేంద్రంలో కలెక్టర్ తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు, కనీస వసతుల కల్పనను పరిశీలించి, అధికారులతో మాట్లాడారు. పరిశీలనలో తహసీల్దార్ మహేష్ కుమార్, అధ్యాపకులు, సిబ్బంది ఉన్నారు. #Sircilla #sircillacollector #garimaagrawal #rajannasircilla #sircilla_rajanna_district
    0 Comments 0 Shares 479 Views 0 Reviews
  • అర్జీలు సకాలంలో పరిష్కరించాలి : సిరిసిల్ల జిల్లా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్.

    ప్రజావాణి అర్జీలు సకాలంలో పరిష్కరించాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. జిల్లా సిరిసిల్ల సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. ఈ సందర్బంగా ఇంచార్జి కలెక్టర్ ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి, త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. మొత్తం దరఖాస్తులు 146 వచ్చాయి.

    రెవెన్యూ శాఖకు సంబంధించి 69, జిల్లా పంచాయతీ అధికారి, గృహ నిర్మాణ శాఖకు 13 చొప్పున, ఉపాధి కల్పన అధికారికి 9, ఎండీ సెస్ 8, జిల్లా సంక్షేమ శాఖ అధికారి, మున్సిపల్ కమిషనర్ సిరిసిల్లకు 4 చొప్పున, జీజీహెచ్ సూపరింటెండెంట్, డీసీఎస్ఓ డీఈఓ, నీటి పారుదల శాఖకు 2 చొప్పున,

    సీపీఓ, డీఏఓ, ఈఈ పీఆర్, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్, ఎంపీడీఓ ముస్తాబాద్, వేములవాడ, ఎల్లారెడ్డిపేట, డీఆర్డీఓ, డీఎస్ సీడీఓ, డీటీఓ, డీవైఎస్ఓ, లీడ్ బ్యాంక్ మేనేజర్, మున్సిపల్ కమిషనర్ వేములవాడ, ఎస్పీ, జడ్పీ ఆఫీస్, ఎస్డీసీకి ఒకటి చొప్పున వచ్చాయి.

    కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ నిఖిత తదితరులు పాల్గొన్నారు.

    #Sircilla #sircillanews #garimaagrawal #rajannasircilla #sircilla_rajanna_district
    అర్జీలు సకాలంలో పరిష్కరించాలి : సిరిసిల్ల జిల్లా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్. ప్రజావాణి అర్జీలు సకాలంలో పరిష్కరించాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. జిల్లా సిరిసిల్ల సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. ఈ సందర్బంగా ఇంచార్జి కలెక్టర్ ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి, త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. మొత్తం దరఖాస్తులు 146 వచ్చాయి. రెవెన్యూ శాఖకు సంబంధించి 69, జిల్లా పంచాయతీ అధికారి, గృహ నిర్మాణ శాఖకు 13 చొప్పున, ఉపాధి కల్పన అధికారికి 9, ఎండీ సెస్ 8, జిల్లా సంక్షేమ శాఖ అధికారి, మున్సిపల్ కమిషనర్ సిరిసిల్లకు 4 చొప్పున, జీజీహెచ్ సూపరింటెండెంట్, డీసీఎస్ఓ డీఈఓ, నీటి పారుదల శాఖకు 2 చొప్పున, సీపీఓ, డీఏఓ, ఈఈ పీఆర్, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్, ఎంపీడీఓ ముస్తాబాద్, వేములవాడ, ఎల్లారెడ్డిపేట, డీఆర్డీఓ, డీఎస్ సీడీఓ, డీటీఓ, డీవైఎస్ఓ, లీడ్ బ్యాంక్ మేనేజర్, మున్సిపల్ కమిషనర్ వేములవాడ, ఎస్పీ, జడ్పీ ఆఫీస్, ఎస్డీసీకి ఒకటి చొప్పున వచ్చాయి. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ నిఖిత తదితరులు పాల్గొన్నారు. #Sircilla #sircillanews #garimaagrawal #rajannasircilla #sircilla_rajanna_district
    0 Comments 0 Shares 1K Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com