• ఈ రోజు 77 వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని చైతన్యపురి డివిజన్ లోని ప్రభాత్ నగర్ , బాబు కాంప్లెక్స్ , ఫణిగిరి , సత్యనారాయణ పురం , వికాస్ నగర్ , న్యూ దిల్సుఖ్ నగర్ మరియు చైతన్యపురి పలు కాలనీల్లో జాతీయ జండా ను స్థానికి కార్పొరేటర్ రంగా నర్సింహా గుప్తా ఎగర వేయడం జరిగింది . ఈ సందర్భంగా మాట్లాడుతూ గత నా యొక్క 5 సవంత్సరముల పదవి కాలంలో డివిజన్ లో అన్ని కాలనీలో CC రోడ్స్ , డ్రైనేజీ , వాటర్ , లైట్స్ మరియు సంక్షేమ పథకాలలో అందరిని కలుపుకొని ముందుకు తీస్కొని పోయిన విషయంలో నాకు సహకరించి , నన్ను ఆశీర్వదించిన నా వెంట నడిచిన ప్రతో ఒక్కరికి పేరు పేరునా కృతజఞతలు , మరియు
    దేశ భద్రత , సమగ్రత , రక్షణ , సాంకేతికత , అభివృద్ధి , విద్య - వైద్యం అన్ని రంగాలలో దేశాన్ని ముందుకు నడిపిస్తన్న ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారికి మన అందరం మద్దతు పలికి సమాజంలో మన వంతు బాధ్యత నిర్వర్తించాలి , ముఖ్యంగా దేశం లో యువత డ్రగ్స్ , గాంజా లాంటి మత్తు పదార్థాలు తో పేడు త్రోవ పట్టకుండా తల్లి తండ్రులు శ్రద్ద పెట్టాలి అని తెలిపినారు . ఈ జండా పండుగ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రుద్రారపు శంకర్ , వెంకన్న , ఉపేందర్ గారు , ఇట్యాల రవి , కొల్లూరు నవీన్ , కులదీపజైన్ , అంజిబాబు , ఉలిపై శివ , జంపాల రాజు , రాజేష్ , పవన్ గారు మొదలగు వారు పాల్గొన్నారు .
    ఈ రోజు 77 వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని చైతన్యపురి డివిజన్ లోని ప్రభాత్ నగర్ , బాబు కాంప్లెక్స్ , ఫణిగిరి , సత్యనారాయణ పురం , వికాస్ నగర్ , న్యూ దిల్సుఖ్ నగర్ మరియు చైతన్యపురి పలు కాలనీల్లో జాతీయ జండా ను స్థానికి కార్పొరేటర్ రంగా నర్సింహా గుప్తా ఎగర వేయడం జరిగింది . ఈ సందర్భంగా మాట్లాడుతూ గత నా యొక్క 5 సవంత్సరముల పదవి కాలంలో డివిజన్ లో అన్ని కాలనీలో CC రోడ్స్ , డ్రైనేజీ , వాటర్ , లైట్స్ మరియు సంక్షేమ పథకాలలో అందరిని కలుపుకొని ముందుకు తీస్కొని పోయిన విషయంలో నాకు సహకరించి , నన్ను ఆశీర్వదించిన నా వెంట నడిచిన ప్రతో ఒక్కరికి పేరు పేరునా కృతజఞతలు , మరియు దేశ భద్రత , సమగ్రత , రక్షణ , సాంకేతికత , అభివృద్ధి , విద్య - వైద్యం అన్ని రంగాలలో దేశాన్ని ముందుకు నడిపిస్తన్న ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారికి మన అందరం మద్దతు పలికి సమాజంలో మన వంతు బాధ్యత నిర్వర్తించాలి , ముఖ్యంగా దేశం లో యువత డ్రగ్స్ , గాంజా లాంటి మత్తు పదార్థాలు తో పేడు త్రోవ పట్టకుండా తల్లి తండ్రులు శ్రద్ద పెట్టాలి అని తెలిపినారు . ఈ జండా పండుగ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రుద్రారపు శంకర్ , వెంకన్న , ఉపేందర్ గారు , ఇట్యాల రవి , కొల్లూరు నవీన్ , కులదీపజైన్ , అంజిబాబు , ఉలిపై శివ , జంపాల రాజు , రాజేష్ , పవన్ గారు మొదలగు వారు పాల్గొన్నారు . 🙏🚩
    0 Comments 0 Shares 202 Views 0 Reviews
  • ప్రభుత్వ హాస్పిటల్స్‌లో ఎక్విప్‌మెంట్ మెయింటనన్స్‌పై ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు.

    రాష్ట్రస్థాయిలో ఒక ప్రత్యేక వ్యవస్థను ఇందుకోసం ఏర్పాటు చేయాలని హెల్త్ సెక్రటరీకి సూచించారు.

    రాష్ట్రస్థాయిలో టీజీఎంఎస్‌ఐడీసీ హెడ్ ఆఫీసులో ఐదుగురు బయోమెడికల్ ఇంజనీర్లతో కూడిన సెంట్రల్ మానిటరింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

    టీజీఎంఎస్‌ఐడీసీలో ఎక్విప్‌మెంట్ విభాగం జనరల్ మేనేజర్‌గా సీనియర్ బయోమెడికల్ ఇంజనీర్‌ను నియమించాలని సూచించారు.

    ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో సబ్ యూనిట్లను ఏర్పాటు చేయాలని, అవసరాన్ని బట్టి ప్రతి సబ్ యూనిట్‌లో ఒకరిద్దరు బయోమెడికల్ ఇంజనీర్లను నియమించాలని ఆదేశించారు.

    ఎక్విప్‌మెంట్ మెయింటనన్స్ విషయంలో హాస్పిటల్‌లో పనిచేసే టెక్నీషియన్లకు, ఎలక్ట్రీషన్లకు బేసిక్ ట్రైనింగ్ ఇప్పించాలని సూచించారు.

    మిషన్ రిపేర్ వచ్చిన గంటలోపల హాస్పిటల్ సూపరింటెండెంట్ సబ్ యూనిట్‌కు, హెడ్ ఆఫీస్‌కు సమాచారం ఇవ్వాలన్నారు.

    సూపరింటెండెంట్ నుంచి సమాచారం వచ్చిన 6 గంటలలోపల బయోమెడికల్ ఇంజనీర్ ఆ హాస్పిటల్‌ను సందర్శించి, సమస్య ఏంటో గుర్తించాలన్నారు.

    మైనర్ రిపేర్లు ఉంటే హాస్పిటల్ స్థాయిలో ఒక్కరోజులోనే ఆ సమస్యను పరిష్కరించే విధంగా కొత్త సిస్టమ్ ఉండాలని మంత్రి ఆదేశించారు.

    మేజర్ రిపేర్లు ఉంటే మూడు రోజుల లోపల ఆ సమస్యను పరిష్కరించి, యంత్రాన్ని వర్కింగ్ కండీషన్‌లోకి తీసుకురావాలన్నారు‌.

    ఒకవేళ ఏవైనా స్పేర్ పార్ట్స్ అవసరమైతే, వెంటనే సంబంధిత ఎక్విప్‌మెంట్ సప్లయర్‌కు సమాచారం ఇచ్చి దాన్ని రిపేర్‌ చేయించాలన్నారు.

    ఎక్విప్‌మెంట్ పూర్తిగా ఉపయోగంలో ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత హాస్పిటల్ సూపరింటెండెంట్లదేనన్నారు.

    ప్రతి యంత్రం, ఫర్నీచర్ పేషెంట్లకు ఉపయోగపడేలా చూసుకోవాలని మంత్రి సూచించారు.

    ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు.

    హాస్పిటల్ స్థాయిని బట్టి, ఏ హాస్పిటల్‌లో ఏయే ఎక్విప్‌మెంట్ ఉండాలో ఒక స్టాండర్డ్ లిస్ట్ తయారు చేయాలని మంత్రి ఆదేశించారు.

    ఇందుకోసం నిమ్స్ డైరెక్టర్ బీరప్ప, డీఎంఈ నరేంద్ర కుమార్, వీవీపీ కమిషనర్ అజయ్ కుమార్ సభ్యులుగా కమిటీని నియమించారు.

    ఈ కమిటీ నివేదిక ఆధారంగా అన్ని హాస్పిటల్స్‌లో ఎక్విప్‌మెంట్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు.
    ప్రభుత్వ హాస్పిటల్స్‌లో ఎక్విప్‌మెంట్ మెయింటనన్స్‌పై ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. రాష్ట్రస్థాయిలో ఒక ప్రత్యేక వ్యవస్థను ఇందుకోసం ఏర్పాటు చేయాలని హెల్త్ సెక్రటరీకి సూచించారు. రాష్ట్రస్థాయిలో టీజీఎంఎస్‌ఐడీసీ హెడ్ ఆఫీసులో ఐదుగురు బయోమెడికల్ ఇంజనీర్లతో కూడిన సెంట్రల్ మానిటరింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. టీజీఎంఎస్‌ఐడీసీలో ఎక్విప్‌మెంట్ విభాగం జనరల్ మేనేజర్‌గా సీనియర్ బయోమెడికల్ ఇంజనీర్‌ను నియమించాలని సూచించారు. ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో సబ్ యూనిట్లను ఏర్పాటు చేయాలని, అవసరాన్ని బట్టి ప్రతి సబ్ యూనిట్‌లో ఒకరిద్దరు బయోమెడికల్ ఇంజనీర్లను నియమించాలని ఆదేశించారు. ఎక్విప్‌మెంట్ మెయింటనన్స్ విషయంలో హాస్పిటల్‌లో పనిచేసే టెక్నీషియన్లకు, ఎలక్ట్రీషన్లకు బేసిక్ ట్రైనింగ్ ఇప్పించాలని సూచించారు. మిషన్ రిపేర్ వచ్చిన గంటలోపల హాస్పిటల్ సూపరింటెండెంట్ సబ్ యూనిట్‌కు, హెడ్ ఆఫీస్‌కు సమాచారం ఇవ్వాలన్నారు. సూపరింటెండెంట్ నుంచి సమాచారం వచ్చిన 6 గంటలలోపల బయోమెడికల్ ఇంజనీర్ ఆ హాస్పిటల్‌ను సందర్శించి, సమస్య ఏంటో గుర్తించాలన్నారు. మైనర్ రిపేర్లు ఉంటే హాస్పిటల్ స్థాయిలో ఒక్కరోజులోనే ఆ సమస్యను పరిష్కరించే విధంగా కొత్త సిస్టమ్ ఉండాలని మంత్రి ఆదేశించారు. మేజర్ రిపేర్లు ఉంటే మూడు రోజుల లోపల ఆ సమస్యను పరిష్కరించి, యంత్రాన్ని వర్కింగ్ కండీషన్‌లోకి తీసుకురావాలన్నారు‌. ఒకవేళ ఏవైనా స్పేర్ పార్ట్స్ అవసరమైతే, వెంటనే సంబంధిత ఎక్విప్‌మెంట్ సప్లయర్‌కు సమాచారం ఇచ్చి దాన్ని రిపేర్‌ చేయించాలన్నారు. ఎక్విప్‌మెంట్ పూర్తిగా ఉపయోగంలో ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత హాస్పిటల్ సూపరింటెండెంట్లదేనన్నారు. ప్రతి యంత్రం, ఫర్నీచర్ పేషెంట్లకు ఉపయోగపడేలా చూసుకోవాలని మంత్రి సూచించారు. ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. హాస్పిటల్ స్థాయిని బట్టి, ఏ హాస్పిటల్‌లో ఏయే ఎక్విప్‌మెంట్ ఉండాలో ఒక స్టాండర్డ్ లిస్ట్ తయారు చేయాలని మంత్రి ఆదేశించారు. ఇందుకోసం నిమ్స్ డైరెక్టర్ బీరప్ప, డీఎంఈ నరేంద్ర కుమార్, వీవీపీ కమిషనర్ అజయ్ కుమార్ సభ్యులుగా కమిటీని నియమించారు. ఈ కమిటీ నివేదిక ఆధారంగా అన్ని హాస్పిటల్స్‌లో ఎక్విప్‌మెంట్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు.
    0 Comments 0 Shares 766 Views 0 Reviews

  • మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా.

    ప్రజాసమస్యల పరిష్కారం కోసం బీజేపీ పోరుబాట కార్యక్రమంలో భాగంగా జవహార్ నగర్ లో బీజేపీ నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్.
    స్థానికులు తమ సమస్యలను ఎంపీ ఈటలకు వివరించారు. ఇక్కడ ఉన్నవాళ్ళం ఎక్కువ మందిమి ఇళ్ళల్లో పనిచేసి బ్రతికే వాళ్ళం. ఇల్లు లేవు. కట్టుకున్న ఇల్లు కూడా కూలగొడుతున్నారు అంటూ మొరపెట్టుకున్నారు. దవాఖాన లేదు, కాన్పులకు కష్టం అవుతుంది. సీసీ రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజి, తాగునీటి నల్లా కనెక్షన్ ఇవ్వాలని కోరారు. లక్ష్మీపూర్ కాలనీకి దారి లేకుండా కబ్జా చేశారు. అంబులెన్స్ కూడా పోయే దారిలేదని, ఎక్స్ సర్వీస్ మెన్ కాలనీలో పార్క్ ను నాయకులు కబ్జా చేస్తున్నారు కాపాడాలని, వీరభద్ర కాలనీలో డ్రైనేజీ లేక కాలనీ మొత్తం నిండిపోతుందని, పాపయనగర్ కాలనీ అంతా చెరువు నీళ్లతో మునుగుతుంది.. శాశ్వత పరిష్కారం ఇవ్వాలని కోరుతున్నామని విన్నవించారు.
    బంజారకాలనీలో కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయాలని కోరారు.

    ఈటల రాజేందర్ మాట్లాడుతూ :
    40 ఏళ్ళ క్రితం పొట్టచేత పట్టుకుని వచ్చిన వారికి ఆశ్రయం కల్పించిన గడ్డ ఇది. ఉద్యమ బిడ్డగా, కరోనా సమయంలో పనిచేసిన మంత్రిగా నన్ను చూసి గొప్ప మెజారిటీతో గెలిపించారు. సొంత జాగాలో ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు ఇవ్వనిదే కట్టుకోనివ్వడం లేదు. గద్దల్లా పడుతున్నారు అని వాపోయారు. మేమంతా ఇళ్లలో పని చేసుకొని బ్రతికేవాళ్లం. మమ్ముల్ని పట్టించుకొనే వారు లేరు మీరన్న పట్టించుకోండి అంటే మేమే మీ దగ్గరికి వచ్చాం. ఇక్కడే ఉంటున్న మెదక్ జిల్లాకు చెందిన చిన్న పిల్లాన్ని కుక్కలు పీక్కతిన్నప్పుడు నేను వచ్చా. ఆరోజు వారి సమస్యలు విని చలించిపోయా. ఈ ధర్నా ప్రభుత్వానికి హెచ్చరిక. ఇది ఈ ప్రాంతం వారికోసం మాత్రమే కాదు ప్రజలందరి కోసం చేస్తున్న పోరాటం ఇది. మూర్ఖపు గుడ్డి ప్రభుత్వం కళ్లు తెరిపించాలి అనే ఈ ధర్నా. ఇక్కడ ఉన్న వాళ్ళంతా పేదలు.
    దేశం నలుమూలల నుండి వచ్చిన కార్మికులు.
    డంప్ యార్డ్ పక్కన ఉంటున్నారు.. కెమికల్ నీళ్లతో చచ్చిపోతామని, వాసన చూసినా జబ్బులు వస్తాయని తెలిసినా ఉంటున్నారు అంటే వీరు దిక్కులేని వారని అర్థం కావడం లేదా ? రోజా అనే ఆమె చెప్పింది 30 ఏళ్ల క్రితం వచ్చినం, 24 ఏళ్ల క్రితం భూమి కొనుక్కొని, ఇప్పుడు రేకులు వేసుకుందాం అని వేస్తే కూలగొట్టారు. ఇదేం న్యాయం అని ఆమె అడుగుతుంది. 30 గజాల్లో ఇల్లు కట్టుకొనే వారు ఉన్నోళ్ల్లా? లేనోళ్లా ? అని నేను అడుగుతున్నా. బంజారాహిల్స్ లో మీ నాయకులు కోట్ల విలువైన భూములు కబ్జా పెట్టుకుంటే GO No. 58, 59 కింద రెగ్యులరైజ్ ఎలా చేస్తారు.. ఈ పేదవాళ్ల ఇల్లు ఎలా కూలగొడతారు.. అని నేను అడుగుతున్న.
    బస్తీల మీద పడి ఇల్లు కూలగొడుతున్నారు.
    వారికి అండగా పక్షి లెక్క తిరుగుతున్న.
    హైడ్రాను ఆహా ఓహో అన్న వాళ్లకు మూడు నెలలు అయ్యాక అర్థం అయ్యింది. వారు కూలగొట్టింది పెద్దలవి కావు పేదలవి అని. కోర్టులను కూడా గౌరవించకుండా రేవంత్ రెడ్డి సర్కార్ వ్యవహరిస్తుంది. ఎవరు మీరు..పేదల మీద దౌర్జన్యం చేస్తున్నారు. జవహర్ నగర్ లో ఇల్లు ఎందుకు కొల్లగొడుతున్నారు సమాధానం చెప్పాలి. టైగర్ నరేంద్ర, దత్తాత్రేయ, బద్దం బాల్ రెడ్డిలాంటి వాళ్ళు వీళ్లకు ఈ జాగాలు ఇప్పించారు. కాంగ్రెస్ పేదల పక్షం ఇందిరమ్మ రాజ్యం అని చెప్తారు. ఇందిరమ్మ రాజ్యం అంటే పేదల ఇళ్లను కూలగొట్టడమా ? మీ చూపు పెద్దోళ్ళ మీదనా ? పేదోళ్ల మీదనా ? మేము మర్యాదగా చెప్పిపోతున్నాం..
    అధికారులు పేదల జీవితాలతో చెలగాటమాడితే.. జాగ్రత్త. మీ పద్దు రాసి పెడుతున్నాం.. ప్రజా క్షేత్రంలో మీకు శిక్ష తప్పదు. మీకు చిత్తశుద్ధి ఉంటే కట్టుకున్న ఇళ్లకు పట్టాలు ఇవ్వండి. మిగిలిన భూముల్లో పేదలకు ఇళ్లను నిర్మించి ఇవ్వండి. కేంద్రం డబ్బులు ఇచ్చినా కేసీఆర్ కి ఇల్లు కట్టడం చేతకాలేదు.. కట్టిన ఇల్లు ఇవ్వలేదు. 20 ఏళ్ల క్రితం కట్టిన ఇళ్లను కూడా పంచలేక పోయారు. చిన్న జిల్లాలో కలెక్టర్ ప్రజలందరినీ కలుస్తారు అనుకున్నాం కానీ ఒక్కరోజు రాలేదు. కానీ పోలీసులని పట్టుకొని బుల్డోజర్లు పట్టుకుని వస్తున్నారు. 30 గజాల్లో కట్టుకున్న ఇల్లు కులగొడుతున్నారు. పేదల బస్తీలలో త్వరలో పాదయాత్ర చేస్తా. మీతో యుద్ధానికి సిద్ధం.
    మీ అధికారం పోలీసుల ఏం చేస్తారో చూస్తాం.
    కోటిన్నర మంది చెత్త ఒక్క డంప్ యార్డ్ లో వేస్తారా ।
    సిటీకి నాలుగు దిక్కుల వేయాలి కదా..
    ఈ డంప్ యార్డు తో ప్రాణాలతో చెలగాటం ఆడతార ? సిటికి దూరంగా చెత్త వేయాలని కోరుతున్నా.
    డంప్ యార్డ్ నాలుగు దిక్కుల పెట్టేవరకు మేము ఆందోళన చేస్తాం. దవాఖాన లేక రోడ్డుమీద ప్రసూతి అయ్యి చచ్చిపోతున్నారు. వెంటనే ఇక్కడ ఆసుపత్రి ఏర్పాటు చేయాలి. ప్రజలారా.. మీరు చెప్పిన సమస్యలన్నిటి మీద దృష్టి పెట్టి అన్నిటినీ పరిష్కరించే ప్రయత్నం చేస్తాం. ఈ కార్యక్రమంలో.. మాజీ ఎమ్మెల్యేలు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, సుభాష్ రెడ్డి, విక్రమ్ రెడ్డి, బుద్ది శ్రీను, శ్రీనివాస రెడ్డి, మల్లారెడ్డి, రంగారెడ్డి, ఏనుగు సుదర్శన్ రెడ్డి, శిల్పారెడ్డి, కార్పొరేటర్లు మహేశ్వర్ రెడ్డి, పవన్, శేషగిరి, సునీత, సురేందర్ యాదవ్, మల్లిఖార్జున్, బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
    మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా. ప్రజాసమస్యల పరిష్కారం కోసం బీజేపీ పోరుబాట కార్యక్రమంలో భాగంగా జవహార్ నగర్ లో బీజేపీ నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్. స్థానికులు తమ సమస్యలను ఎంపీ ఈటలకు వివరించారు. ఇక్కడ ఉన్నవాళ్ళం ఎక్కువ మందిమి ఇళ్ళల్లో పనిచేసి బ్రతికే వాళ్ళం. ఇల్లు లేవు. కట్టుకున్న ఇల్లు కూడా కూలగొడుతున్నారు అంటూ మొరపెట్టుకున్నారు. దవాఖాన లేదు, కాన్పులకు కష్టం అవుతుంది. సీసీ రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజి, తాగునీటి నల్లా కనెక్షన్ ఇవ్వాలని కోరారు. లక్ష్మీపూర్ కాలనీకి దారి లేకుండా కబ్జా చేశారు. అంబులెన్స్ కూడా పోయే దారిలేదని, ఎక్స్ సర్వీస్ మెన్ కాలనీలో పార్క్ ను నాయకులు కబ్జా చేస్తున్నారు కాపాడాలని, వీరభద్ర కాలనీలో డ్రైనేజీ లేక కాలనీ మొత్తం నిండిపోతుందని, పాపయనగర్ కాలనీ అంతా చెరువు నీళ్లతో మునుగుతుంది.. శాశ్వత పరిష్కారం ఇవ్వాలని కోరుతున్నామని విన్నవించారు. బంజారకాలనీలో కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయాలని కోరారు. ఈటల రాజేందర్ మాట్లాడుతూ : 40 ఏళ్ళ క్రితం పొట్టచేత పట్టుకుని వచ్చిన వారికి ఆశ్రయం కల్పించిన గడ్డ ఇది. ఉద్యమ బిడ్డగా, కరోనా సమయంలో పనిచేసిన మంత్రిగా నన్ను చూసి గొప్ప మెజారిటీతో గెలిపించారు. సొంత జాగాలో ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు ఇవ్వనిదే కట్టుకోనివ్వడం లేదు. గద్దల్లా పడుతున్నారు అని వాపోయారు. మేమంతా ఇళ్లలో పని చేసుకొని బ్రతికేవాళ్లం. మమ్ముల్ని పట్టించుకొనే వారు లేరు మీరన్న పట్టించుకోండి అంటే మేమే మీ దగ్గరికి వచ్చాం. ఇక్కడే ఉంటున్న మెదక్ జిల్లాకు చెందిన చిన్న పిల్లాన్ని కుక్కలు పీక్కతిన్నప్పుడు నేను వచ్చా. ఆరోజు వారి సమస్యలు విని చలించిపోయా. ఈ ధర్నా ప్రభుత్వానికి హెచ్చరిక. ఇది ఈ ప్రాంతం వారికోసం మాత్రమే కాదు ప్రజలందరి కోసం చేస్తున్న పోరాటం ఇది. మూర్ఖపు గుడ్డి ప్రభుత్వం కళ్లు తెరిపించాలి అనే ఈ ధర్నా. ఇక్కడ ఉన్న వాళ్ళంతా పేదలు. దేశం నలుమూలల నుండి వచ్చిన కార్మికులు. డంప్ యార్డ్ పక్కన ఉంటున్నారు.. కెమికల్ నీళ్లతో చచ్చిపోతామని, వాసన చూసినా జబ్బులు వస్తాయని తెలిసినా ఉంటున్నారు అంటే వీరు దిక్కులేని వారని అర్థం కావడం లేదా ? రోజా అనే ఆమె చెప్పింది 30 ఏళ్ల క్రితం వచ్చినం, 24 ఏళ్ల క్రితం భూమి కొనుక్కొని, ఇప్పుడు రేకులు వేసుకుందాం అని వేస్తే కూలగొట్టారు. ఇదేం న్యాయం అని ఆమె అడుగుతుంది. 30 గజాల్లో ఇల్లు కట్టుకొనే వారు ఉన్నోళ్ల్లా? లేనోళ్లా ? అని నేను అడుగుతున్నా. బంజారాహిల్స్ లో మీ నాయకులు కోట్ల విలువైన భూములు కబ్జా పెట్టుకుంటే GO No. 58, 59 కింద రెగ్యులరైజ్ ఎలా చేస్తారు.. ఈ పేదవాళ్ల ఇల్లు ఎలా కూలగొడతారు.. అని నేను అడుగుతున్న. బస్తీల మీద పడి ఇల్లు కూలగొడుతున్నారు. వారికి అండగా పక్షి లెక్క తిరుగుతున్న. హైడ్రాను ఆహా ఓహో అన్న వాళ్లకు మూడు నెలలు అయ్యాక అర్థం అయ్యింది. వారు కూలగొట్టింది పెద్దలవి కావు పేదలవి అని. కోర్టులను కూడా గౌరవించకుండా రేవంత్ రెడ్డి సర్కార్ వ్యవహరిస్తుంది. ఎవరు మీరు..పేదల మీద దౌర్జన్యం చేస్తున్నారు. జవహర్ నగర్ లో ఇల్లు ఎందుకు కొల్లగొడుతున్నారు సమాధానం చెప్పాలి. టైగర్ నరేంద్ర, దత్తాత్రేయ, బద్దం బాల్ రెడ్డిలాంటి వాళ్ళు వీళ్లకు ఈ జాగాలు ఇప్పించారు. కాంగ్రెస్ పేదల పక్షం ఇందిరమ్మ రాజ్యం అని చెప్తారు. ఇందిరమ్మ రాజ్యం అంటే పేదల ఇళ్లను కూలగొట్టడమా ? మీ చూపు పెద్దోళ్ళ మీదనా ? పేదోళ్ల మీదనా ? మేము మర్యాదగా చెప్పిపోతున్నాం.. అధికారులు పేదల జీవితాలతో చెలగాటమాడితే.. జాగ్రత్త. మీ పద్దు రాసి పెడుతున్నాం.. ప్రజా క్షేత్రంలో మీకు శిక్ష తప్పదు. మీకు చిత్తశుద్ధి ఉంటే కట్టుకున్న ఇళ్లకు పట్టాలు ఇవ్వండి. మిగిలిన భూముల్లో పేదలకు ఇళ్లను నిర్మించి ఇవ్వండి. కేంద్రం డబ్బులు ఇచ్చినా కేసీఆర్ కి ఇల్లు కట్టడం చేతకాలేదు.. కట్టిన ఇల్లు ఇవ్వలేదు. 20 ఏళ్ల క్రితం కట్టిన ఇళ్లను కూడా పంచలేక పోయారు. చిన్న జిల్లాలో కలెక్టర్ ప్రజలందరినీ కలుస్తారు అనుకున్నాం కానీ ఒక్కరోజు రాలేదు. కానీ పోలీసులని పట్టుకొని బుల్డోజర్లు పట్టుకుని వస్తున్నారు. 30 గజాల్లో కట్టుకున్న ఇల్లు కులగొడుతున్నారు. పేదల బస్తీలలో త్వరలో పాదయాత్ర చేస్తా. మీతో యుద్ధానికి సిద్ధం. మీ అధికారం పోలీసుల ఏం చేస్తారో చూస్తాం. కోటిన్నర మంది చెత్త ఒక్క డంప్ యార్డ్ లో వేస్తారా । సిటీకి నాలుగు దిక్కుల వేయాలి కదా.. ఈ డంప్ యార్డు తో ప్రాణాలతో చెలగాటం ఆడతార ? సిటికి దూరంగా చెత్త వేయాలని కోరుతున్నా. డంప్ యార్డ్ నాలుగు దిక్కుల పెట్టేవరకు మేము ఆందోళన చేస్తాం. దవాఖాన లేక రోడ్డుమీద ప్రసూతి అయ్యి చచ్చిపోతున్నారు. వెంటనే ఇక్కడ ఆసుపత్రి ఏర్పాటు చేయాలి. ప్రజలారా.. మీరు చెప్పిన సమస్యలన్నిటి మీద దృష్టి పెట్టి అన్నిటినీ పరిష్కరించే ప్రయత్నం చేస్తాం. ఈ కార్యక్రమంలో.. మాజీ ఎమ్మెల్యేలు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, సుభాష్ రెడ్డి, విక్రమ్ రెడ్డి, బుద్ది శ్రీను, శ్రీనివాస రెడ్డి, మల్లారెడ్డి, రంగారెడ్డి, ఏనుగు సుదర్శన్ రెడ్డి, శిల్పారెడ్డి, కార్పొరేటర్లు మహేశ్వర్ రెడ్డి, పవన్, శేషగిరి, సునీత, సురేందర్ యాదవ్, మల్లిఖార్జున్, బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
    0 Comments 0 Shares 9K Views 0 Reviews
  • *మారుతినగర్ లో కార్పొరేటర్ శ్రవణ్ పాదయాత్ర*

    ఈ రోజు మల్కాజ్గిరి డివిజన్, మారుతి నగర్ లో మాల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ పాదయాత్ర నిర్వహించారు.

    ఈ సందర్బంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ప్రతి ఒక్కరు తమ తల్లి పేరు మీద ఒక మొక్క నాటాలని( *మా కె నామ్ ఏక్ పేడ్* ) కోరారు.

    ఈ సందర్బంగా అనిల్, శంకర్ వారి తల్లి గారి పేరు పై మొక్కలు నాటడం జరిగింది.

    అదే విధంగా కాలనీ వాసులు తీసుకోచ్చిన పలు సమస్యలను పరిష్కరించేందుకు సంబంధిత అధికారికి చరవాణి ద్వారా సూచనలు చెయ్యడం జరిగింది.

    ముక్యంగా కరెంటు డిపార్ట్మెంట్ వారికీ కరెంటు కోతలు, కొత్త పోల్స్ వెయ్యుట, చెట్ల కొమ్మల ట్రిమ్మింగ్, వాటర్ వర్క్స్ సిల్ట్ ఎత్తివేత తదితర సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సూచించడం జరిగింది.

    ఈ కార్యక్రమం లో కాలనీ అధ్యక్షులు శంకు, ప్రధాన కార్యదర్శి హరినాథ్ గౌడ్, జై కృష్ణ, ఆనంద్, శంకర్, అంజి, సుబ్రహ్మణ్యం, జ్ఞానేశ్వర్ , రవి, జస్వంత్ తదితరులు పాల్గొన్నారు.
    *మారుతినగర్ లో కార్పొరేటర్ శ్రవణ్ పాదయాత్ర* ఈ రోజు మల్కాజ్గిరి డివిజన్, మారుతి నగర్ లో మాల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ప్రతి ఒక్కరు తమ తల్లి పేరు మీద ఒక మొక్క నాటాలని( *మా కె నామ్ ఏక్ పేడ్* ) కోరారు. ఈ సందర్బంగా అనిల్, శంకర్ వారి తల్లి గారి పేరు పై మొక్కలు నాటడం జరిగింది. అదే విధంగా కాలనీ వాసులు తీసుకోచ్చిన పలు సమస్యలను పరిష్కరించేందుకు సంబంధిత అధికారికి చరవాణి ద్వారా సూచనలు చెయ్యడం జరిగింది. ముక్యంగా కరెంటు డిపార్ట్మెంట్ వారికీ కరెంటు కోతలు, కొత్త పోల్స్ వెయ్యుట, చెట్ల కొమ్మల ట్రిమ్మింగ్, వాటర్ వర్క్స్ సిల్ట్ ఎత్తివేత తదితర సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సూచించడం జరిగింది. ఈ కార్యక్రమం లో కాలనీ అధ్యక్షులు శంకు, ప్రధాన కార్యదర్శి హరినాథ్ గౌడ్, జై కృష్ణ, ఆనంద్, శంకర్, అంజి, సుబ్రహ్మణ్యం, జ్ఞానేశ్వర్ , రవి, జస్వంత్ తదితరులు పాల్గొన్నారు.
    0 Comments 1 Shares 546 Views 26 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com