పీకలవాగును పరిశీలించిన ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు
గుంటూరు పశ్చిమ నియోజకవర్గములో ప్రవహించే కీలకమైన పీకలవాగు ప్రాంతాన్ని ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి గారు బుధవారం నగర కమిషనర్ మయూర అశోక్ గారితో కలిసి విస్తృతంగా పరిశీలించారు. ప్రధానంగా 1/18 బ్రాడీపేట, కోబాల్ట్‌పేట 6వ లైన్, దేవాపురం 4వ లైన్, కంకరగుంట ఆర్‌యూబీ తదితర ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు.
వర్షాకాలంలో ఏర్పడే వరద పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ముందస్తు...