సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో నెలలో 100 ఇండ్లు ప్రారంభానికి సిద్దం చేయాలి: సిరిసిల్ల జిల్లా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 8వ వార్డ్ లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను గురువారం ఇంచార్జి కలెక్టర్ పరిశీలించారు. ఇంచార్జి కలెక్టర్ వెళ్లి లబ్దిదారులతో మాట్లాడారు. ఇల్లు ఎప్పుడు మొదలు పెట్టారు? ప్రభుత్వ సహాయం అందుతుందా తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 808 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసిందని, వాటిలో 554 ఇండ్లకు ముగ్గు పోశారని, 461 ఇండ్లు బేస్ మెంట్ లెవెల్, 326 గోడల లెవెల్ లో, 250 స్లాబ్ లెవెల్ లో ఉన్నాయని ఇంచార్జి కలెక్టర్ వెల్లడించారు. ముగ్గు పోసిన వారితో పనులు మొదలు పెట్టించాలని, బేస్మెంట్ వరకు పూర్తి చేసిన వారిని గోడల వరకు, అక్కడి నుంచి స్లాబ్ లెవెల్ కు, తుది దశ పనులు పూర్తి చేసేలా.. ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకునేలా చూడాలని ఆదేశించారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో స్లాబ్ లెవెల్ లో ఉన్న ఇండ్లలో ఈ నెలలో 100 పూర్తి చేసి, గృహ ప్రవేశానిక్ సిద్దం చేయాలని ఆదేశించారు. లబ్దిదారులు త్వరగా పూర్తి చేసుకోవాలని, నూతన గృహ ప్రవేశానికి తాను హాజరు అవుతానని తెలిపారు. మున్సిపల్, హౌసింగ్, వార్డ్ అధికారులు ఇందిరమ్మ ఇండ్ల పురోగతిని నిత్యం పరిశీలించాలని సూచించారు. లబ్దిదారులకు ఇటుకులు ఇతర సామగ్రి అందుబాటులో ఉండేలా.. సరైన ధరకు వచ్చేలా హౌసింగ్ అధికారులతో సమన్వయం చేసుకొని ముందుకు వెళ్లాలని ఆదేశించారు. పురోగతిలో ఉన్న ఇండ్ల ఫోటోలు ఎప్పటికప్పుడు ఆన్లైన్ లో అప్ లోడ్ చేయాలని సూచించారు. పరిశీలనలో హౌసింగ్ పీడీ శంకర్, మున్సిపల్ కమిషనర్ ఖాదీర్ పాషా తదితరులు పాల్గొన్నారు. #Sircilla జిల్లా

0 Comments
0 Shares
311 Views
0 Reviews