*ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు కౌన్సిలింగ్*

గ్రామ పంచాయతీ ఎన్నికల కోడ్ కారణంగా ఆగిపోయిన వైద్య, ఆరోగ్య శాఖ పరిధిలోని ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2 పోస్టుల కౌన్సిలింగ్ ప్రక్రియను ఈ నెల 20 నుంచి 22 వరకు నిర్వహిస్తున్నట్లు పబ్లిక్ హెల్త్ డీహెచ్ డా. బి రవీందర్ నాయక్ తెలిపారు. 7 జోన్ల పరిధిలో మొత్తం 1,052 పోస్టులను భర్తీ చేసేందుకు 2024 లో చేపట్టిన ఎంపిక ప్రక్రియలో భాగంగా ఇప్పటికే ఎంపికైన అభ్యర్థుల జాబితాను వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ నెల 20న చార్మినార్, ఈ నెల 21న జోగులాంబ, యాదాద్రి, రాజన్న జోన్ల పరిధిలో, ఈ నెల 22న భద్రాద్రి, బాసర, కాళేశ్వరం జోన్ల పరిధిలో కౌన్సిలింగ్ ప్రక్రియ ఉంటుంది.

అభ్యర్థులు హాల్ టికెట్, ఆధార్ కార్డుతో కౌన్సెలింగ్‌‌కు హాజరు కావాలని డీహెచ్ కోరారు. అయితే, గత 35 ఏళ్లుగా పనిచేస్తున్న సుమారు 120 మంది వరకు గ్రేడ్-2 ల్యాబ్ టెక్నీషియన్లకు నేటికీ ప్రమోషన్లు కల్పించకుండానే కొత్తగా 1052 పోస్టులను భర్తీ చేస్తున్నారని... తమకు పదోన్నతులు కల్పించి ఉంటే కొత్తగా ఉద్యోగాల్లో నియమితులయ్యే వారికి తమ పోస్టుల్లో నియమించేందుకు అవకాశం ఉండేదని ల్యాబ్ టెక్నీషియన్లు తెలిపారు.
*ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు కౌన్సిలింగ్* గ్రామ పంచాయతీ ఎన్నికల కోడ్ కారణంగా ఆగిపోయిన వైద్య, ఆరోగ్య శాఖ పరిధిలోని ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2 పోస్టుల కౌన్సిలింగ్ ప్రక్రియను ఈ నెల 20 నుంచి 22 వరకు నిర్వహిస్తున్నట్లు పబ్లిక్ హెల్త్ డీహెచ్ డా. బి రవీందర్ నాయక్ తెలిపారు. 7 జోన్ల పరిధిలో మొత్తం 1,052 పోస్టులను భర్తీ చేసేందుకు 2024 లో చేపట్టిన ఎంపిక ప్రక్రియలో భాగంగా ఇప్పటికే ఎంపికైన అభ్యర్థుల జాబితాను వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ నెల 20న చార్మినార్, ఈ నెల 21న జోగులాంబ, యాదాద్రి, రాజన్న జోన్ల పరిధిలో, ఈ నెల 22న భద్రాద్రి, బాసర, కాళేశ్వరం జోన్ల పరిధిలో కౌన్సిలింగ్ ప్రక్రియ ఉంటుంది. అభ్యర్థులు హాల్ టికెట్, ఆధార్ కార్డుతో కౌన్సెలింగ్‌‌కు హాజరు కావాలని డీహెచ్ కోరారు. అయితే, గత 35 ఏళ్లుగా పనిచేస్తున్న సుమారు 120 మంది వరకు గ్రేడ్-2 ల్యాబ్ టెక్నీషియన్లకు నేటికీ ప్రమోషన్లు కల్పించకుండానే కొత్తగా 1052 పోస్టులను భర్తీ చేస్తున్నారని... తమకు పదోన్నతులు కల్పించి ఉంటే కొత్తగా ఉద్యోగాల్లో నియమితులయ్యే వారికి తమ పోస్టుల్లో నియమించేందుకు అవకాశం ఉండేదని ల్యాబ్ టెక్నీషియన్లు తెలిపారు.
0 Comments 0 Shares 179 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com