వచ్చే మూడు రోజులు జాగ్రత్తగా ఉండండి: వాతావరణ శాఖ అలర్ట్

వచ్చే మూడు రోజులు ఆంధ్రప్రదేశ్, యానాంలలో భారీగా ఉష్ణోగ్రతలు పడిపోతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయని తెలిపింది. ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజులు తీవ్రమైన చలిగాలులు వీచే అవకాశముందని పేర్కొంది.

రాయలసీమ, ఉత్తర, దక్షిణ కోస్తా, యానాంలో గురువారం, శుక్రవారం, శనివారం పొడి వాతావరణం ఉంటుందని తెలిపింది. రాగల 5 రోజుల్లో రాయలసీమలో కనిష్ట ఉష్ణోగ్రతలు ఒకటి లేదా రెండు చోట్ల సాధారణము కంటే 2-3 డిగ్రీల సెంటీగ్రేడ్ తక్కువగా నమోదయ్యే అవకాశముందని వెల్లడించింది.

ఇక, రాబోయే 2 రోజుల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3°C నుండి 4°C తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. ఉత్తర తెలంగాణ, మధ్య తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఈ రోజు, రేపు చలిగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది..@pinnehasan
వచ్చే మూడు రోజులు జాగ్రత్తగా ఉండండి: వాతావరణ శాఖ అలర్ట్ వచ్చే మూడు రోజులు ఆంధ్రప్రదేశ్, యానాంలలో భారీగా ఉష్ణోగ్రతలు పడిపోతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయని తెలిపింది. ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజులు తీవ్రమైన చలిగాలులు వీచే అవకాశముందని పేర్కొంది. రాయలసీమ, ఉత్తర, దక్షిణ కోస్తా, యానాంలో గురువారం, శుక్రవారం, శనివారం పొడి వాతావరణం ఉంటుందని తెలిపింది. రాగల 5 రోజుల్లో రాయలసీమలో కనిష్ట ఉష్ణోగ్రతలు ఒకటి లేదా రెండు చోట్ల సాధారణము కంటే 2-3 డిగ్రీల సెంటీగ్రేడ్ తక్కువగా నమోదయ్యే అవకాశముందని వెల్లడించింది. ఇక, రాబోయే 2 రోజుల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3°C నుండి 4°C తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. ఉత్తర తెలంగాణ, మధ్య తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఈ రోజు, రేపు చలిగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది..@pinnehasan
0 Comments 0 Shares 14 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com