కోటి రూపాయల బీమా కోసం హత్య.. ప్రియురాలికి మెసేజ్‌లు పంపి దొరికిపోయాడు!




తాను చనిపోయినట్టు నమ్మించేందుకు నాటకం

అమాయకుడైన హిచ్‌హైకర్‌ను కారులో సజీవ దహనం చేసిన వైనం

ప్రియురాలికి మెసేజ్‌లు పంపడంతో గుట్టురట్టు

నిందితుడిని అదుపులోకి తీసుకున్న మహారాష్ట్ర పోలీసులు


తాను చనిపోయినట్టు నమ్మించి, కోటి రూపాయల ఇన్సూరెన్స్ డబ్బు కాజేయాలనుకున్నాడో వ్యక్తి. ఇందుకోసం ఓ అమాయకుడిని దారుణంగా హత్య చేశాడు. కుటుంబ సభ్యులతో సహా అందరూ అతడు చనిపోయాడని కన్నీళ్లు పెట్టుకుంటున్న సమయంలో.. ప్రియురాలికి పంపిన కొన్ని మెసేజ్‌లు అతడి ప్లాన్‌ను తలకిందులు చేశాయి. ఈ షాకింగ్ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది.


పోలీసుల విచారణలో చవాన్ తన నేరాన్ని అంగీకరించాడు. తనకు ఉన్న ఇంటి లోన్ తీర్చేందుకు రూ. కోటి జీవిత బీమా డబ్బులు పొందాలని ఈ ప్లాన్ వేసినట్టు చెప్పాడు. శనివారం గోవింద్ యాదవ్ అనే వ్యక్తికి లిఫ్ట్ ఇచ్చి, మద్యం మత్తులో ఉన్న అతడిని కారు డ్రైవర్ సీటులో కూర్చోబెట్టి సజీవ దహనం చేసినట్టు ఒప్పుకున్నాడు. మృతదేహం తనదేనని నమ్మించేందుకు తన బ్రాస్‌లెట్‌ను కూడా అక్కడే వదిలేశాడు. ప్రస్తుతం చవాన్‌పై హత్య కేసు నమోదు చేసి, ఈ నేరంలో ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని లాతూర్ ఎస్పీ అమోల్ తాంబే తెలిపారు
కోటి రూపాయల బీమా కోసం హత్య.. ప్రియురాలికి మెసేజ్‌లు పంపి దొరికిపోయాడు! తాను చనిపోయినట్టు నమ్మించేందుకు నాటకం అమాయకుడైన హిచ్‌హైకర్‌ను కారులో సజీవ దహనం చేసిన వైనం ప్రియురాలికి మెసేజ్‌లు పంపడంతో గుట్టురట్టు నిందితుడిని అదుపులోకి తీసుకున్న మహారాష్ట్ర పోలీసులు తాను చనిపోయినట్టు నమ్మించి, కోటి రూపాయల ఇన్సూరెన్స్ డబ్బు కాజేయాలనుకున్నాడో వ్యక్తి. ఇందుకోసం ఓ అమాయకుడిని దారుణంగా హత్య చేశాడు. కుటుంబ సభ్యులతో సహా అందరూ అతడు చనిపోయాడని కన్నీళ్లు పెట్టుకుంటున్న సమయంలో.. ప్రియురాలికి పంపిన కొన్ని మెసేజ్‌లు అతడి ప్లాన్‌ను తలకిందులు చేశాయి. ఈ షాకింగ్ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. పోలీసుల విచారణలో చవాన్ తన నేరాన్ని అంగీకరించాడు. తనకు ఉన్న ఇంటి లోన్ తీర్చేందుకు రూ. కోటి జీవిత బీమా డబ్బులు పొందాలని ఈ ప్లాన్ వేసినట్టు చెప్పాడు. శనివారం గోవింద్ యాదవ్ అనే వ్యక్తికి లిఫ్ట్ ఇచ్చి, మద్యం మత్తులో ఉన్న అతడిని కారు డ్రైవర్ సీటులో కూర్చోబెట్టి సజీవ దహనం చేసినట్టు ఒప్పుకున్నాడు. మృతదేహం తనదేనని నమ్మించేందుకు తన బ్రాస్‌లెట్‌ను కూడా అక్కడే వదిలేశాడు. ప్రస్తుతం చవాన్‌పై హత్య కేసు నమోదు చేసి, ఈ నేరంలో ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని లాతూర్ ఎస్పీ అమోల్ తాంబే తెలిపారు
0 Comments 0 Shares 19 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com