స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత పోలింగ్‌కు ప్రజల సహకారం అవసరం: పెద్దపల్లి డీసీపీ బి. రామ్ రెడ్డి

మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా పెద్దపల్లి డీసీపీ బి. రామ్ రెడ్డి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి రూరల్ పరిధిలోని రాఘవాపూర్, అప్పన్నపేట, పెద్ద కల్వల, సుల్తానాబాద్ మండలం, ఎలిగేడు మరియు పోత్కపల్లి గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన భద్రతా చర్యలను పరిశీలించి, పోలీస్ అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రజలతో మాట్లాడి ఎన్నికల సమయంలో శాంతి భద్రతలు కాపాడుకోవాల్సిన అవసరంపై అవగాహన కల్పించారు.

డీసీపీ మాట్లాడుతూ..... స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా, ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగేలా ప్రతి ఒక్కరూ పోలీస్ శాఖకు పూర్తి సహకారం అందించాలని డీసీపీ గారు ప్రజలను కోరారు. పోలింగ్ రోజున తమ ఓటు హక్కును స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా వినియోగించుకోవాలి. పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వహిస్తున్న పోలీస్ మరియు ఎన్నికల అధికారులకు పూర్తి సహకారం అందించాలి. ఎన్నికల ప్రక్రియ మొత్తం ప్రశాంతంగా సాగేందుకు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. పోలింగ్ కేంద్రాల వద్ద గుంపులుగా చేరడం, గొడవలు చేయడం లేదా ఉద్రిక్తత సృష్టించడం చేయరాదు. ఇతర ఓటర్లను భయపెట్టడం, ప్రభావితం చేయడం లేదా ఓటు హక్కును అడ్డుకోవడం నేరమని పోలీసులు హెచ్చరించారు. మద్యం సేవించి పోలింగ్ కేంద్రాల వద్దకు రావడం పూర్తిగా నిషేధమని స్పష్టం చేశారు. తప్పుడు ప్రచారం, వదంతులు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయరాదని సూచించారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఏసీపీ శ్రీ జి. కృష్ణ గారు మరియు పెద్దపల్లి సీఐ శ్రీ ప్రవీణ్ కుమార్ గారు డీసీపీ గారితో కలిసి పాల్గొన్నారు. @Pinnehasan.
స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత పోలింగ్‌కు ప్రజల సహకారం అవసరం: పెద్దపల్లి డీసీపీ బి. రామ్ రెడ్డి మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా పెద్దపల్లి డీసీపీ బి. రామ్ రెడ్డి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి రూరల్ పరిధిలోని రాఘవాపూర్, అప్పన్నపేట, పెద్ద కల్వల, సుల్తానాబాద్ మండలం, ఎలిగేడు మరియు పోత్కపల్లి గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన భద్రతా చర్యలను పరిశీలించి, పోలీస్ అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రజలతో మాట్లాడి ఎన్నికల సమయంలో శాంతి భద్రతలు కాపాడుకోవాల్సిన అవసరంపై అవగాహన కల్పించారు. డీసీపీ మాట్లాడుతూ..... స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా, ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగేలా ప్రతి ఒక్కరూ పోలీస్ శాఖకు పూర్తి సహకారం అందించాలని డీసీపీ గారు ప్రజలను కోరారు. పోలింగ్ రోజున తమ ఓటు హక్కును స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా వినియోగించుకోవాలి. పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వహిస్తున్న పోలీస్ మరియు ఎన్నికల అధికారులకు పూర్తి సహకారం అందించాలి. ఎన్నికల ప్రక్రియ మొత్తం ప్రశాంతంగా సాగేందుకు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. పోలింగ్ కేంద్రాల వద్ద గుంపులుగా చేరడం, గొడవలు చేయడం లేదా ఉద్రిక్తత సృష్టించడం చేయరాదు. ఇతర ఓటర్లను భయపెట్టడం, ప్రభావితం చేయడం లేదా ఓటు హక్కును అడ్డుకోవడం నేరమని పోలీసులు హెచ్చరించారు. మద్యం సేవించి పోలింగ్ కేంద్రాల వద్దకు రావడం పూర్తిగా నిషేధమని స్పష్టం చేశారు. తప్పుడు ప్రచారం, వదంతులు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయరాదని సూచించారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఏసీపీ శ్రీ జి. కృష్ణ గారు మరియు పెద్దపల్లి సీఐ శ్రీ ప్రవీణ్ కుమార్ గారు డీసీపీ గారితో కలిసి పాల్గొన్నారు. @Pinnehasan.
0 Comments 0 Shares 43 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com