ఎన్నికలలో ప్రవర్తన నియమాలు పాటించాలి: ఎంపీడీవో
మానూర్:మూడో విడుత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థులందరూ ఓటర్లను ఎలాంటి ప్రలోభాలకు గురిచేయకుండా ప్రజాస్వామ్య విలువలను కాపాడేవిధంగా ప్రవర్తించాలని మానూర్ ఎంపీడీవో చంద్రశేఖర్అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థులకు మండలం కార్యాలయంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.ఏవిధమైన కేసులలో ఇరుక్కోకుండా ఎన్నికలలో పోటీచేయాలన్నారు.