Bharat Aawaz
*🔊6% దాటిన ద్రవ్యోల్బణం.. తెలంగాణలో 7.26%, ఏపీలో 7.25%*


*🍥దేశంలో అక్టోబరు నెలలో ద్రవ్యోల్బణం 6.09% దాటింది. 2024 అక్టోబరు (6.21%) తర్వాత నమోదైన అత్యధికం ఇదే. ఈ ఏడాది జనవరిలో 2.74 శాతంగా ఉండగా.. ప్రతినెలా క్రమంగా పెరుగుతూ ఇప్పుడు 6.09%కి చేరింది. ఆర్బీఐ నిర్దేశించిన 4% లక్ష్యంతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. ప్రత్యేకించి తెలంగాణలో 7.26%, ఏపీలో 7.25%గా నమోదవగా..దేశంలోని ఎనిమిది రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో 7 శాతానికి మించింది. అందులో పుదుచ్చేరిలో (7.96%), దాద్రానగర్‌ హవేలీ (7.59%), తమిళనాడు (7.29%), మధ్యప్రదేశ్‌ (7.19%), ఒడిశా (7.17%), కర్ణాటకలో (7.07%)గా నమోదైంది.*

భారత్ అవాజ్
మిర్యాలగూడా
4 Views