Bharat Aawaz
మున్నూరు కాపు సంఘం ఆత్మగౌరవ భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.5 కోట్ల నిధులు మంజూరు చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ, సంఘం ప్రతినిధులు నిజామాబాద్‌లో టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ భవనం మున్నూరు కాపు సామాజిక వర్గ ఆత్మగౌరవానికి, ఐక్యతకు ప్రతీకగా నిలవడంతో పాటు సామాజిక అభ్యున్నతికి కేంద్రంగా రూపుదిద్దుకుంటుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు శ్రీ బొబ్బిలి రామకృష్ణ, మున్నూరు కాపు సంఘం నిజామాబాద్ అధ్యక్షులు శ్రీ ధర్మపురి సంజయ్, మాజీ ఎమ్మెల్సీ శ్రీమతి ఆకుల లలిత, శ్రీ రాములు, శ్రీ రత్నాకర్, శ్రీ గోపికృష్ణ తదితరులు పాల్గొన్నా
రు.
55 Views