Bharat Aawaz
మదనపల్లె: మదనపల్లె మండల జెడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి జన్నే కిరణ్మయి శేష విజయం సాధించారు. నామినేషన్ దాఖలు చేసే సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ వెనక్కి తగ్గకుండా పట్టుదలతో నామినేషన్ వేసి ఎన్నికల బరిలో నిలిచారు. ఎన్నో అడ్డంకులను అధిగమించి ఎన్నికల్లో పోటీ చేసి జనసేన అభ్యర్థి కొప్పుల రమ్యపై 1,326 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అర్ధరాత్రి ఒంటి గంట వరకు సాగిన ఓట్ల లెక్కింపులో చివరకు విజయం ఖరారైంది. నామినేషన్ దశలో ఎదురైన ఇబ్బందులను అధిగమించి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ప్రజా తీర్పుతో జెడ్పీటీసీగా విజయం సాధించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
7 Views