మదనపల్లె: మదనపల్లె పట్టణ పరిధిలోని ఆసుపత్రులు, ప్రైవేట్ హాస్పిటళ్లు, లాడ్జీలు, హోటళ్లు, పాఠశాలలు, కళాశాలలు, షాపింగ్ మాల్స్‌లో అగ్నిమాపక భద్రతా నిబంధనల అమలుపై సమగ్ర విచారణ జరపాలని బహుజన యువ సేన (BYS) డిమాండ్ చేసింది. ఈ మేరకు బహుజన యువ సేన రాష్ట్ర అధ్యక్షులు పునీత్ కుమార్ నేతృత్వంలో స్థానిక ఫైర్ ఆఫీసర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పునీత్ కుమార్ మాట్లాడుతూ.. క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించకుండానే నిబంధనలకు విరుద్ధంగా ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారనే ఆరోపణలపై విచారణ జరపాలని కోరారు. వందలాది మంది ప్రజలు, రోగులు, విద్యార్థులు రాకపోకలు సాగించే బహుళ అంతస్తుల భవనాల్లో అగ్నిమాపక భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని తెలిపారు.
4 Views