Bharat Aawaz
బ్రిక్స్ సుస్థిర జీవనశైలి వారోత్సవాల్లో భాగంగా ఆరో రోజైన గురువారం మదనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రామారావు కాలనీ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఆధ్వర్యంలో ఒకసారి ఉపయోగించే ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యావరణానికి, మానవ ఆరోగ్యానికి కలిగే నష్టాలను వివరించారు. ప్లాస్టిక్ కవర్లు, టీ కప్పులు, వాటర్ గ్లాసులు వంటి వస్తువుల వినియోగం రోజురోజుకు పెరుగుతోందన్నారు. ప్లాస్టిక్ సులభంగా నాశనం కాకపోవడంతో పర్యావరణంలో దీర్ఘకాలం ఉండి కాలుష్యానికి కారణమవుతుందని తెలిపారు.
23 Views