Madanapalle: మదనపల్లె మండలంలోని కోళ్లబైలు 1, 2 ఇంచార్జ్ రాటకొండ శ్రీనివాసులు నాయుడు, ఎంపీటీసీ అభ్యర్థి మోహన్ రెడ్డితో పాటు మల్లికార్జున, పల్ల రామచంద్ర, రాజు, బాషా, రాము తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా రాటకొండ శ్రీనివాసులు నాయుడు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజలు పెద్ద సంఖ్యలో పోలింగ్లో పాల్గొని ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని కోరారు.
38 Views