మిషన్ లైఫ్, స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా బుధవారం మదనపల్లి-2 ఆర్టీసీ డిపోలో సిబ్బంది కోసం సుస్థిర ఆహార విధానాలపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. డిపో మేనేజర్ లక్ష్మీ నారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో, న్యూరో సర్జన్ డాక్టర్ మల్లికార్జున ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం పోషక విలువలున్న ఆహారం తీసుకోవాలని, ఆహారాన్ని వృథా చేయకుండా చిరుధాన్యాలను అలవాటు చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను ఆయన వివరించారు.
41 Views