Bharat Aawaz
చెత్త సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలి: కలెక్టర్ ఇలాత్రిపాఠి
నిజామాబాద్ నగరంలో పారిశుద్ధ్య నిర్వహణను మరింత పటిష్టం చేయాలని జిల్లా కలెక్టర్ ఇలాత్రిపాఠి అధికారులను ఆదేశించారు. బుధవారం నగరంలోని డంపింగ్ యార్డును ఆమె సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు.
ఈ సందర్భంగా డంపింగ్ యార్డులో పేరుకుపోయిన చెత్తను బయోమైనింగ్ ప్రక్రియ ద్వారా వేగంగా తొలగించాలని సూచించారు. రోజుకు 600 మెట్రిక్ టన్నుల చెత్తను బయోమైనింగ్ ద్వారా శుద్ధి చేస్తున్నట్లు అధికారులు కలెక్టర్‌కు వివరించారు. ఈ సామర్థ్యాన్ని మరింత పెంచాలని, చెత్తను ఎప్పటికప్పుడు తొలగిస్తూ డంపింగ్ యార్డును పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు.
అలాగే చెత్త నిర్వహణ, బయోమైనింగ్ పనులు, పారిశుద్ధ్య చర్యలను నిరంతరం పర్యవేక్షించాలని సంబంధిత అధికారులకు సూచించారు.
నిజామాబాద్ | నవంబర్ 4
23 Views