Bharat Aawaz
🚨 దీపావళి పండుగ నేపథ్యంలో బాణసంచా విక్రయాలపై పోలీస్ కమిషనర్ సమీక్ష

🔹 తాత్కాలిక బాణసంచా విక్రయ లైసెన్సులపై క్రాకర్స్ అసోసియేషన్, హోల్‌సేల్ షాపుల యాజమాన్యాలతో సమీక్ష నిర్వహించిన పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐ.పి.ఎస్.

🔹 లైసెన్సులు పొందిన తర్వాతే విక్రయాలు చేపట్టాలి. అగ్నిమాపక పరికరాలు, ఇసుక, నీటి బకెట్లు తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలి.

🔹 18 ఏళ్లలోపు పిల్లలకు బాణసంచా విక్రయించరాదు. రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు దుకాణాలు మూసివేయాలి.

🔹 భద్రతా నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు.

🚔 అత్యవసర సంప్రదింపులు: పోలీస్ – 112 | ఫైర్ – 101
24 Views