Madanapalle: మదనపల్లె మున్సిపాలిటీ 42వ వార్డులో జనసేన పార్టీ తరఫున కౌన్సిలర్‌గా విజయం సాధించిన మండపల్లి గాయత్రి తనను గెలిపించిన వార్డు ప్రజలకు పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు. తన విజయానికి సహకరించి, అహర్నిశలు కృషి చేసిన జేసీబీ మధుసూదన్ రెడ్డికి ఘనంగా సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ.. 42వ వార్డులో సాధించిన ఈ విజయం తన ఒక్కడిదే కాదని, వార్డులోని ప్రతి ఒక్కరిదని అన్నారు. తనపై నమ్మకంతో జనసేన అభ్యర్థి మండపల్లి గాయత్రిని గెలిపించిన ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా నూతన కౌన్సిలర్ పనిచేస్తూ వార్డు అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. ప్రజల సహకారంతో మరింత అభివృద్ధి సాధిస్తామని ఆయన పేర్కొన్నారు.
62 Views