ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): ఆసిఫాబాద్ జిల్లాలోని అన్ని గ్రామాలకు ప్రతీరోజూ తప్పనిసరిగా తాగునీరు సరఫరా చేయాలని జిల్లా కలెక్టర్ కె.హరిత గారు, అధికారులను ఆదేశించారు. బుధవారం అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు.
తాగునీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా చూసేందుకు నవంబర్ 16 నుంచి డిసెంబర్ 31 వరకు జిల్లావ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ఈ...