Bharat Aawaz
*చెత్తలో కూర్చొని కౌన్సిలర్ నిరసన*

*కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పాత పట్టణ ప్రాంతాలతో పాటు ప్రభుత్వ ఆసుపత్రిని మున్సిపల్ అధికారులు చెత్త డంపింగ్ యార్డుగా మారుస్తున్నారని 46 & 47వ వార్డు కౌన్సిలర్లు గెరిగంటి స్వప్న - లక్ష్మినారాయణ ఆవేదన వ్యక్తం చేశారు*
*కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పాత పట్టణ ప్రాంతంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రిని మున్సిపల్ అధికారులు చెత్త డంపింగ్ యార్డుగా మారుస్తున్నారని 46 & 47వ వార్డుల కౌన్సిలర్లు గెరిగంటి స్వప్న - లక్ష్మినారాయణ ఆవేదన వ్యక్తంచేశారు మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా కౌన్సిలర్ గెరిగంటి లక్ష్మినారాయణ చెత్తలో కూర్చొని నిరసన తెలిపారు బుధవారం వారు మాట్లాడుతూ మున్సిపాలిటీలో పనిచేసే పారిశుధ్య కార్మికులు కొందరు ప్రతి రోజు రాత్రి వేళల్లో రోడ్లు శుభ్రం చేసే వారు అయితే ఈమధ్య మున్సిపల్ కమిషనర్ అ పద్ధతిని తొలగించి షిఫ్ట్ చేంజ్ చేయడంతో ఉదయం 11 గంటల వరకు రోడ్లు శుభ్రం కావడం లేదన్నారు కమిషనర్ అతి ఉత్సాహం, నిర్లక్ష్యం వల్లనే ఈ పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తంచేశారు దీంతో పాత పట్టణ పరిసరాలతో పాటు ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో నిత్యం చెత్తా సరిగ్గా సేకరించకపోవడంతో వ్యర్థాలు కుప్పలు కుప్పలుగా పేరుకుపోతున్నాయని తెలిపారు చెత్త కుప్పలతో జిల్లా కేంద్రంనికి వచ్చే నియోజక వర్గ ప్రజలు మరియు పరిసరాల్లో నివసించే ప్రజలు మరియు ఆసుపత్రికి వచ్చే రోగులు ప్రజలు తీవ్ర దుర్గంధంతో అదనపు అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి ప్రత్యేక పారిశుధ్య చర్యలు చేపట్టాలని మున్సిపల్ పరిధిలోని 49 వార్డుల ప్రజలతో పాటు ముఖ్యంగా పాత పట్టణం మరియు స్టేషన్ రోడ్డు, సుభాష్ రోడ్డు, ప్రభుత్వ ఆసుపత్రి ఏరియా లను పరిశుభ్రంగా ఉంచాలని డిమాండ్ చేశారు*
*గెరిగంటి స్వప్న - లక్ష్మినారాయణ*
*46 & 47వ వార్డుల కౌన్సిలర్లు*
34 Views