సింగరేణి, నవంబర్ 3: సింగరేణి బొగ్గు గనుల్లో అనధికార గైర్హాజరు కారణంగా 2023 నుంచి 2025 మధ్య విధుల నుంచి తొలగించబడిన మాజీ కార్మికులకు తిరిగి ఉద్యోగంలో చేరేందుకు అవకాశం కల్పిస్తూ సింగరేణి యాజమాన్యం సర్క్యులర్ జారీ చేసింది. డిస్మిస్ కార్మికుల కేసులను పునఃపరిశీలించి, అర్హులకు పునర్నియామకం కల్పించే అంశాన్ని పరిశీలించేందుకు హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది.
ఇటీవల బొగ్గు బెల్ట్ ప్రాంతాల ప్రజాప్రతినిధులు...