పుంగనూరు: పారుతున మురికి నీరు,పుంగనూరులోని కొత్త ఇండ్లు, ఎస్ఎస్ లాడ్జి మరియు బొగ్గిడి గోపాల్ హౌస్ సమీపంలో గత కొంతకాలంగా మురికి నీరు రోడ్లపై ఏరులై పారుతోంది. దీనివల్ల స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంటి యజమానులకు పలుమార్లు చెప్పినా ఎటువంటి మార్పు రాలేదని బాధితులు వాపోతున్నారు. సమస్య తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, సంబంధిత మున్సిపాలిటీ అధికారులు వెంటనే స్పందించి, తగిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు.
84 Views