వెస్ట్ వెంకటాపురం నాలాపై అక్రమ నిర్మాణాలు- అచేతన స్థితిలో అధికారులు
అల్వాల్ పరిధిలోని వెస్ట్ వెంకటాపురంలోగల నిరంతరం నీరు పారే నాలాని సైతం భూ కబ్జాదారులు వదలడం లేదు. నాలాని ఆనుకుని నాలుగు వ్యాపార సముదాయ షెటర్స్.. ఆపై దానిపై ఒక ఫ్లోర్ దర్జాగా నిర్మిస్తున్నారు. దీనిపై ఎవ్వరు స్పందించకపోవడం విస్మయం కలిగిస్తోంది. నిరంతరం ఆ దారిన తిరిగే రాజకీయ నాయకులు... సంబంధిత అధికారులు ఆ నిర్మాణాలను చూస్తూ నిమ్మకుండడం పలు అనుమానాలకు తావిస్తోంది. హైడ్రా అధికారులు నాలాలపై ఎటువంటి నిర్మాణాలు జరపకూడదని హెచ్చరించిన, ఆక్రమణదారులు వాటిని లెక్క చేయడం లేదంటే.. ఎంతటి పలుకుబడి ఉపయోగిస్తున్నారో అర్థమవుతోంది. ఉండడానికి నిరుపేదలు నివాసాల కోసం కట్టుకున్న ఇళ్లను అక్రమ నిర్మాణాల పేరుతో హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. మరి ఇలాంటి అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు ఎందుకు పట్టించుకోరు!? స్థానికంగా పనిచేసే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? ఇది సామాన్యుడి మదిలో మెదిలే నిరంతర ఆలోచన. ఇప్పటికైనా అధికారులు ఆ అక్రమ నిర్మాణాలపై దృష్టి పెట్టాలని స్థానికులు కోరుతున్నారు.

26 Views
257 Views