🚩ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డిని కలిసిన NHM ఉద్యోగులు
▫️సర్వీసుల క్రమబద్ధీకరణ, సమాన పనికి సమాన వేతనం కల్పించాలని NHM ఉద్యోగుల విజ్ఞప్తి
▫️పెండింగ్‌లో ఉన్న ఇంక్రిమెంట్లు, బోనస్‌లు విడుదల చేయాలని వినతి
▫️ఉద్యోగుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించాలని ఎమ్మెల్యేకు విజ్ఞప్తి
▫️సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి
🔸నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డిని సోమవారం NHM (జాతీయ ఆరోగ్య మిషన్) ఉద్యోగులు కలిసి తమ సమస్యలను వివరించి, న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. తమ సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించి, పరిష్కారానికి కృషి చేయాలని ఎమ్మెల్యేకు వినతిపత్రం సమర్పించారు.గత 14 రోజులుగా డిమాండ్ల పరిష్కారం కొరకు సమ్మె చేపడుతున్నట్లు వివరించారు.
🔸ఈ సందర్భంగా NHM ఉద్యోగులు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా వివిధ కేడర్లలో పనిచేస్తున్న ఉద్యోగులు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. ఎన్నో ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్నప్పటికీ తమ ఉద్యోగాలకు తగిన భద్రత, వేతనాలు, ఇతర ప్రయోజనాలు అందడం లేదని పేర్కొన్నారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి ఉద్యోగులకు న్యాయం చేయాలని కోరారు.
🔸NHM ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు ఇవీ..
1. సర్వీసుల క్రమబద్ధీకరణ: రాష్ట్రవ్యాప్తంగా 78 కేడర్లలో పనిచేస్తున్న 17,541 మంది NHM ఉద్యోగుల సేవలను క్రమబద్ధీకరించి, తమ ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలని కోరారు.
2. సమాన పనికి సమాన వేతనం: రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా విధులు నిర్వహిస్తున్న తమకు సమాన వేతనాలు, పే స్కేల్ అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.
3. ప్రభుత్వ ఉత్తర్వుల అమలు: జీవో నంబర్ 60, 1195 ప్రకారం పెరిగిన వేతనాలను తక్షణమే అమలు చేసి, ఉద్యోగులకు న్యాయం చేయాలని కోరారు.
4. పెండింగ్‌లో ఉన్న ఇంక్రిమెంట్లు, బోనస్‌ల విడుదల: 2022 నుంచి పెండింగ్‌లో ఉన్న 5 శాతం వార్షిక ఇంక్రిమెంట్లు, 8 శాతం లయబిలిటీ బోనస్‌ను వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.
5. మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులు: మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన 180 రోజుల ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని కోరారు.
6. ఆరోగ్య భద్రత, బీమా సదుపాయాలు: NHM ఉద్యోగులందరికీ హెల్త్ కార్డులు, ఉద్యోగుల ఆరోగ్య పథకం (EHS) కింద ఆరోగ్య బీమా, జీవిత బీమా సదుపాయాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
7. ఉద్యోగ భద్రత: ఉద్యోగులకు తగిన ఉద్యోగ భద్రత కల్పించి, ఎలాంటి కారణం లేకుండా విధుల నుంచి తొలగించకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
🔸ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి NHM ఉద్యోగుల సమస్యలు, డిమాండ్లను సానుకూలంగా విన్నారు. ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, వారి న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఉద్యోగుల సమస్యలను సంబంధిత ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లి, సాధ్యమైనంత త్వరగా పరిష్కారం లభించేలా కృషి చేస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో NHM జిల్లా JAC యూనియన్ నాయకులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

17 Views