Bharat Aawaz
Madanapalle: మదనపల్లె మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డులో టీడీపీ అభ్యర్థి రాగినేని కవిత ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె భర్త రాగినేని రఘుపతి నాయుడు మాట్లాడుతూ ఎమ్మెల్యే షాజహాన్ భాష ఆదేశాల మేరకు కూటమి చైర్మన్ అభ్యర్థి శ్రీరామ్ కుమార్ చినబాబుకు చైర్మన్ ఎన్నికలో మద్దతు ఇవ్వాలని, అలాగే 3వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన సతీమణి రాగినేని కవితకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. నవంబర్ 1వ తేదీన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుందని తెలిపారు. వార్డు అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొంటూ, ఓటర్లు తమ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుపై వేయాలని రఘుపతి నాయుడు విజ్ఞప్తి చేశారు.
14 Views