తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ఆదివారం ప్రమాదం సంభవించింది. భక్తులతో వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి కొండను ఢీకొట్టిన ఘటనలో ఐదుగురు గాయపడ్డారు. బాధితులను తమిళనాడుకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.
తమిళనాడు నుంచి వచ్చిన భక్తులు శ్రీవారిని దర్శించుకుని కారులో తిరుపతికి తిరుగుప్రయాణమయ్యారు. ఈ క్రమంలో మొదటి ఘాట్ రోడ్డులోని మాల్వాడి గుండం సమీపంలోకి రాగానే, కారు అదుపుతప్పి వేగంగా వెళ్లి రోడ్డు పక్కన ఉన్న కొండను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు భక్తులకు గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, టీటీడీ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం కారణంగా ఘాట్ రోడ్డులో కొంతసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడగా, పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.

16 Views