Bharat Aawaz
కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. సోమవారం ఉదయం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్‌లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు.

టైమ్ స్లాట్ టోకెన్లు లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి సుమారు 15 గంటల సమయం పడుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు వెల్లడించారు. క్యూలైన్లలో, కంపార్ట్‌మెంట్‌లలో వేచి ఉన్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ సిబ్బంది పాలు, తాగునీరు మరియు అన్నప్రసాదాలను నిరంతరం అందిస్తున్నారు.

నిన్న (ఆదివారం) శ్రీవారిని మొత్తం 85,369 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 26,414 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆదివారం ఒక్కరోజే భక్తులు సమర్పించిన కానుకల ద్వారా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.13 కోట్లుగా నమోదైనట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
25 Views