Bharat Aawaz
డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం 40వ వార్షికోత్సవం (రూబీ జూబ్లీ) సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్రత్యేక సందర్భంలో విద్యార్థులు, అధ్యాపకులు, వైద్యులు, పరిశోధకులు, సిబ్బందికి ఆయన హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.

దివంగత ఎన్టీ రామారావు గారి సంకల్పంతో ప్రారంభమైన ఈ విశ్వవిద్యాలయం నాలుగు దశాబ్దాలుగా వైద్య విద్య, పరిశోధన, ప్రజారోగ్య రంగాల్లో కీలక పాత్ర పోషిస్తోందని ప్రశంసించారు. నాణ్యమైన విద్య ద్వారా సమాజానికి నిబద్ధత కలిగిన వైద్యులను అందించడం గర్వకారణమని అన్నారు.

"వైద్యం కేవలం ఒక వృత్తి మాత్రమే కాదు, ప్రాణాలను కాపాడే పవిత్రమైన బాధ్యత. సాంకేతికత వైద్యానికి శక్తిని ఇస్తే, మానవత్వం దానికి మరింత విలువను చేకూరుస్తుంది" అని ముఖ్యమంత్రి తన సందేశంలో పేర్కొన్నారు. 40 ఏళ్ల వైద్య సేవా స్ఫూర్తితో ఈ విశ్వవిద్యాలయం భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు.
25 Views