Bharat Aawaz
మదనపల్లె: మదనపల్లె మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డులో జనసేన పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి మల్లిక ఎన్నికల ప్రచారాన్ని జోరుగా నిర్వహిస్తున్నారు. వార్డులోని ప్రజలను కలుసుకుంటూ తనకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. ఆమెకు మద్దతుగా జనసేన పార్టీ నాయకురాలు జయ భవ్య ప్రచారంలో పాల్గొని ఓటర్లను కలిసి పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా జయ భవ్య మాట్లాడుతూ, మదనపల్లె పట్టణ అభివృద్ధి కోసం కూటమి అభ్యర్థులకు ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు. మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి శ్రీరామ్ కుమార్ చినబాబును గెలిపించడంతో పాటు, 5వ వార్డు జనసేన కౌన్సిలర్ అభ్యర్థి మల్లికను కూడా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల సమస్యల పరిష్కారం, వార్డు అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగాలని అభ్యర్థులు కృషి చేస్తారని తెలిపారు. ఈ ప్రచార కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
13 Views