Bharat Aawaz
మదనపల్లె: అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజకవర్గంలోని నిమ్మనపల్లె మండల జడ్పీటీసీ స్థానానికి టీడీపీ సీనియర్ నాయకుడు మునిరత్నం నామినేషన్ దాఖలు చేశారు. శుక్రవారం నిమ్మనపల్లె రోడ్డులోని జీఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన నామినేషన్ల కేంద్రంలో ఆయన నామినేషన్ సమర్పించారు. ఈ సందర్భంగా మునిరత్నం మాట్లాడుతూ.. పార్టీ అధిష్ఠానం తనకు జడ్పీటీసీ అభ్యర్థిగా అవకాశం కల్పిస్తే ప్రజలకు సేవ చేస్తానని తెలిపారు. పార్టీ నాయకత్వం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు
23 Views