Bharat Aawaz
Annamayya: అన్నమయ్య జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల అభ్యర్థులు నిర్భయంగా నామినేషన్లు దాఖలు చేసుకోవడానికి పూర్తి పోలీసు రక్షణ కల్పిస్తామని జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్,. గారు తెలిపారు. ఎవరైనా నామినేషన్లను అడ్డుకున్నా లేదా బెదిరింపులకు పాల్పడినా వెంటనే స్థానిక ఎస్ హెచ్ ఓ, సీఐ లేదా డీఎస్పీల దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు. అలాంటి ఫిర్యాదులపై తక్షణమే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా, ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు ప్రజలు, అభ్యర్థులు పోలీసు యంత్రాంగానికి సహకరించాలని జిల్లా ఎస్పీ గారు విజ్ఞప్తి చేశారు.
23 Views