మదనపల్లె: మదనపల్లె మున్సిపాలిటీ 15వ వార్డులో జనసేన పార్టీ అభ్యర్థి సిరివేలు చరణ్ కుమార్ విజయమే లక్ష్యంగా కూటమి నాయకులు, కార్యకర్తలు ఏకతాటిపైకి వచ్చారు. కూటమి అభ్యర్థి గెలుపు కోసం సమష్టిగా కృషి చేస్తూ ఎన్నికల ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. వార్డులోని ప్రజలను కలిసి తమ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ అభ్యర్థి సిరివేలు చరణ్ కుమార్ మాట్లాడుతూ.. 15వ వార్డు అభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. కూటమి నాయకులు, కార్యకర్తలు తన విజయానికి ఐక్యంగా కృషి చేయడం సంతోషంగా ఉందన్నారు. ప్రజలు తనకు అవకాశం కల్పిస్తే వార్డును అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. ప్రజల ఆదరాభిమానాలతో విజయం సాధిస్తాననే నమ్మకం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
18 Views