Bharat Aawaz
Thamballapalle: అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లెలో జనసేన పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేయడం, వాహనాలను నాశనం చేయడం, జనసేన, టీడీపీ శ్రేణులపై దాడులకు పాల్పడటాన్ని మదనపల్లె జనసేన నాయకుడు జంగాల శివరాం రాయల్ తీవ్రంగా ఖండించారు. కర్రలు, ఇనుప ముళ్లు ఉన్న ఆయుధాలతో దాడులు చేయడం ఆందోళనకరమని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా జంగాల శివరాం మాట్లాడుతూ, ఎన్నికల్లో ఓటమి భయంతోనే వైసీపీ శ్రేణులు ఇలాంటి దాడులకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. రాజకీయ విభేదాలను హింసాత్మక చర్యల ద్వారా పరిష్కరించుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు.
39 Views