నందిపేట్లో నూతన గ్రంథాలయ భవన నిర్మాణ పనులు ప్రారంభం
40 ఏళ్ల నిరీక్షణకు తెర.. నందిపేట్ ప్రజల చిరకాల స్వప్నం సాకారం
నందిపేట్ గ్రామంలో గత నాలుగు దశాబ్దాలుగా అద్దె భవనంలో కొనసాగుతున్న గ్రంథాలయానికి ఎట్టకేలకు నూతన భవన నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. 1986 ఆగస్టు 27 నుంచి 40 సంవత్సరాలుగా అద్దె భవనంలో కొనసాగుతున్న గ్రంథాలయానికి సొంత భవనం నిర్మాణం చేపట్టడంతో గ్రామ ప్రజల చిరకాల కోరిక నెరవేరే దిశగా అడుగులు పడ్డాయి.
ఇన్నాళ్లుగా చిన్న అద్దె భవనంలో గ్రంథాలయం కొనసాగుతుండటంతో విద్యార్థులు, నిరుద్యోగ యువత, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మెరుగైన వసతులతో కూడిన నూతన గ్రంథాలయ భవనాన్ని ఏర్పాటు చేయాలని పలుమార్లు విజ్ఞప్తులు చేసినప్పటికీ, వారి నిరీక్షణకు ఇప్పటివరకు ముగింపు లభించలేదు.
తాజాగా నూతన గ్రంథాలయ భవన నిర్మాణ పనులు ప్రారంభం కావడంతో విద్యార్థులు, యువత, గ్రామ ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది. నూతన భవనం అందుబాటులోకి వస్తే విద్యార్థులకు ప్రశాంతమైన వాతావరణంలో చదువుకునే అవకాశం కలగడంతో పాటు, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే నిరుద్యోగ యువతకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది.

19 Views