Bharat Aawaz
💻 నిజామాబాద్ ఐటీ టవర్‌లో SVAGS Technologies కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి

🔸నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఐటీ టవర్‌లో డిచ్‌పల్లి మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు సాయిలు కుమారుడు సాయి తేజ నూతనంగా ఏర్పాటు చేసిన SVAGS Technologies సంస్థ కార్యాలయాన్ని బుధవారం ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, రిబ్బన్ కట్ చేసి సంస్థ కార్యకలాపాలను ప్రారంభించారు.

🔸అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ..

తెలంగాణ ప్రభుత్వం ఐటీ రంగ అభివృద్ధికి, యువతకు ఉపాధి అవకాశాల కల్పనకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోందన్నారు. ఐటీ టవర్ల ఏర్పాటు ద్వారా జిల్లాల్లోని యువతకు సాంకేతిక రంగంలో పనిచేసే అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయని తెలిపారు. స్థానికంగా ఐటీ సంస్థలు ఏర్పాటవడం వల్ల యువతకు ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు జిల్లాల ఆర్థిక అభివృద్ధికి కూడా దోహదపడుతుందని పేర్కొన్నారు.

🔸యువత ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లడమే కాకుండా, తమ నైపుణ్యాలు, ఆలోచనలతో కొత్త సంస్థలను స్థాపించి మరికొందరికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని ఎమ్మెల్యే సూచించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ నూతన ఆవిష్కరణలతో ముందుకు వస్తున్న యువతను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.

🔸SVAGS Technologies సంస్థ కార్ల సర్వీసులకు సంబంధించి ప్రత్యేక అప్లికేషన్‌ను అభివృద్ధి చేసి, సాంకేతిక పరిజ్ఞానం ద్వారా వినియోగదారులకు సేవలను విస్తరించేందుకు ముందుకు రావడం అభినందనీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆధునిక సాంకేతికతను ప్రజలకు మరింత చేరువ చేసే ఇలాంటి ప్రయత్నాలు యువతలో నూతన ఆలోచనలకు ప్రేరణనిస్తాయని అన్నారు.
66 Views