Bharat Aawaz
Madanapalle: కూటమి ప్రభుత్వం విజయమే లక్ష్యంగా, పార్టీ ఆదేశాల మేరకు మదనపల్లె మున్సిపాలిటీలోని 42వ వార్డును జనసేన పార్టీకి కేటాయించడం జరిగిందని 42వ వార్డు అధ్యక్షుడు మండిపల్లి (జేసీబీ) మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఎన్డీఏ కూటమి తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటానని, వార్డు అధ్యక్షుడిగా తన బాధ్యతను నిర్వర్తిస్తూ 42వ వార్డులో కూటమి అభ్యర్థి గెలుపు కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు. వార్డులో పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుంటూ అభ్యర్థి విజయానికి కృషి చేసి, ఆ విజయాన్ని పార్టీ అధిష్ఠానానికి బహుమతిగా అందించడం తన బాధ్యతగా భావిస్తున్నానని మధుసూదన్ రెడ్డి వెల్లడించారు.
45 Views