మదనపల్లె: మదనపల్లె మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డా. ఎస్.ఎన్.హెచ్. అఫ్సర్ షరీఫ్‌ను హస్తం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, సీనియర్ నాయకుడు గాజుల భాస్కర్ కోరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభయ హస్తం ప్రచార పాంప్లెట్ను ఆవిష్కరించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి డా. అఫ్సర్ షరీఫ్ మాట్లాడుతూ, రాష్ట్ర విభజనకు ముందు కాంగ్రెస్ పార్టీ నాయకుల హయాంలోనే అభివృద్ధి జరిగిందని పేర్కొన్నారు. అనంతరం టీడీపీ, వైసీపీ నాయకులు మున్సిపల్ చైర్మన్లుగా పనిచేసినా మదనపల్లెలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని అన్నారు. తనను చైర్మన్‌గా గెలిపిస్తే మదనపల్లె అభివృద్ధికి కృషి చేసి చూపిస్తానని తెలిపారు. ఓటర్లు తమ అమూల్యమైన ఓటును హస్తం గుర్తుపై వేసి తనను ఆదరించాలని విజ్ఞప్తి చేశారు.
52 Views