Madanapalle: మదనపల్లె ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీటీసీ నామినేషన్ల స్వీకరణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా వన్‌టౌన్ సీఐ మోహన్ కుమార్, ఎస్ఐ చంద్రమోహన్ ఆధ్వర్యంలో పటిష్ఠ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యాలయ పరిసరాల్లో పోలీసు సిబ్బందిని మోహరించి, బారికేడ్లు ఏర్పాటు చేశారు. నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా పోలీసులు పర్యవేక్షిస్తున్నారు.
57 Views