Bharat Aawaz
ఎర్రవెల్లి నివాసంలో ఘనంగా దసరా వేడుకలు..

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర రావు గారి ఎర్రవెల్లి నివాసంలో మంగళవారం నాడు దసరా వేడుకలు ఘనంగా జరిగాయి.

వేద పండితుల సమక్షంలో KCR గారు సాంప్రదాయ పద్ధతిలో వాహన పూజ ఆయుధపూజ నిర్వహించారు.. ఈ వాహన పూజా కార్యక్రమంలో కేటీఆర్, హిమాన్షు రావు పాల్గొన్నారు.

కుటుంబ సభ్యులు ఇతర పార్టీ నేతలు పాల్గొనగా శమీవృక్షానికి పూజ నిర్వహించిన కేసీఆర్ గారు, కార్యక్రమంలో పాల్గొన్న వారికి దసరా శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు.

ఎర్రవెల్లిలో నిర్వహించిన దసరా వేడుకల్లో... కేసీఆర్ గారి ధర్మపత్ని శోభమ్మ గారు, కుమారుడు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కోడలు శైలిమ, మనుమడు కల్వకుంట్ల హిమాన్షు రావు తదితర కుటుంబ సభ్యులతో పాటు.. మాజీ హోం మంత్రి మహమ్మద్ మెహమూద్ అలీ, జహంగీర్ తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు.
93 Views