నందిపేట్ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో దసరా సందర్భంగ ఈరోజు గ్రామ పంచాయతీ సిబ్బందికి దుస్తులు, నిత్యావసర వస్తువులు, చెప్పులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నందిపేట్ సర్పంచ్ ఎర్రం లింగం, ఉపసర్పంచ్ రామ్ చందర్, వార్డు సభ్యులు, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నందిపేట్ సర్పంచ్ ఎర్రం లింగం మాట్లాడుతూ గ్రామ పంచాయతీ సిబ్బంది తమ తమ వార్డుల్లో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని, గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. అలాగే నీటిని వృథా చేయకుండా అవసరం లేని సమయంలో నల్లాలను మూసివేయాలని సూచించారు.
గ్రామంలో పరిశుభ్రతను కాపాడటం, నీటి వృథాను అరికట్టడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.

109 Views