🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్):
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పశువైద్య మరియు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని శాఖా కార్యాలయంలో ప్రత్యేక వేడుకలను ఏర్పాటు చేశారు.
ఈ సంబరాలలో పశుసంవర్ధక శాఖ అధికారులు, సిబ్బంది మరియు స్థానిక ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు....