రోలుగుంట మండలం చోడవరం నియోజకవర్గం పరిధిలోని రోలుగుంట మండల జెడ్పీటీసీ స్థానానికి తెలుగుదేశం కూటమి అభ్యర్థిగా బంటు చిరంజీవికి టికెట్ కేటాయించాలని ఐటీడీపీ మండల అధ్యక్షులు బంటు రాజు పార్టీ అధిష్ఠానాన్ని కోరారు. కాపు సామాజిక వర్గానికి తగిన ప్రాధాన్యత కల్పిస్తూ రాబోయే జెడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి తరపున కాపు సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. బంటు చిరంజీవి గత కొంతకాలంగా పార్టీ...