తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి నియోజకవర్గానికి ఒక్కటి చొప్పున ఏర్పాటు చేయనున్న తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల (Telangana Public Schools) పథకంలో భాగంగా నిజామాబాద్ నగరంలోని కోటగల్లి బాలికల ఉన్నత పాఠశాలలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయనున్నారు. ఈ స్కూల్ నిర్మాణం కోసం స్థలం ఖరారైంది. స్కూల్ అభివృద్ధికి రూ. 6 కోట్లు నిధులు మంజూరు చేయడం జరిగింది.
గురువారం ఉదయం జిల్లా కలెక్టర్ శ్రీమతి ఇలా త్రిపాఠి గారు, అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్తా గారు, నగర మేయర్ శ్రీమతి కూరగాయల ఉమారాణి రమేష్ గారు కలిసి కోటగల్లి బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించి స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలోని ప్రస్తుత మౌలిక వసతులు, అందుబాటులో ఉన్న స్థలం, విద్యార్థుల సంఖ్య తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు.
సుమారు 2,000 మంది విద్యార్థులు అభ్యసిస్తున్న ఈ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను తెలంగాణ పబ్లిక్ స్కూల్‌గా అభివృద్ధి చేయడం ద్వారా నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ఒకే క్యాంపస్‌లో నాణ్యమైన విద్య అందించే అవకాశం ఏర్పడుతుందని అధికారులు తెలిపారు. పబ్లిక్ స్కూల్ నిర్మాణానికి రూ. 6 కోట్లు మంజూరు కావడం సంతోషకరమని మేయర్ శ్రీమతి ఉమారాణి రమేష్ గారు వ్యాఖ్యానించారు.
“చిన్ననాడు నేను సైతం ఇదే స్కూల్లో చదువుకున్నాను. ఇప్పుడు ఈ స్కూల్ అభివృద్ధి చెందడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. త్వరలోనే డీపీఆర్ (Detailed Project Report) సిద్ధం చేసి టెండర్లు ఆహ్వానించాలి” అని మేయర్ గారు ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఏసీఎల్బీ భుజంగరావు గారు, మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ గారు, స్థానిక కార్పొరేటర్ ప్రసన్న శ్యామల గారు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సిబ్బంది మరియు స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

186 Views