రోలుగుంట:ఈ గ్రామం ఎక్కడో మారుమూల అడవుల్లో లేదు. మన నర్సీపట్నానికి కేవలం 18 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. కానీ ఈ విషయం ఇప్పటివరకు ఎవరికీ తెలియదు. గూగుల్ పటంలో కూడా కనిపించని ఆ గ్రామం పేరు కొమ్మర్ల.అనకాపల్లి జిల్లాకు అల్లూరి జిల్లాకు మధ్య కొండపై ఉన్న ఈ గ్రామంలో రోడ్డు లేదు, నీరు లేదు. అమాయక గిరిజన పిల్లలు సిమెంటు సంచులతో కట్టిన చిన్న గుడిసెలోనే చదువుకుంటున్నారు. నేల మీద కూర్చుని, చిరిగిన పలకలతో వారి...