ఆసిఫాబాద్ జిల్లాలో ఘోర ప్రమాదం పెళ్లయిన కొద్దిరోజులకే గురుకుల లెక్చరర్ తేజస్విని దుర్మరణం
🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): పెళ్లయిన కొద్దిరోజులకే జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ నవవధువు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. పార్ట్ టైమ్ లెక్చరర్‌గా పనిచేస్తున్న బండే తేజస్విని (26) అనే యువతి మృతి చెందడంతో ఆమె పుట్టింటి, అత్తింటి కుటుంబాలలో తీరని శోకం నెలకొంది.
కళాశాలకు వెళ్తుండగా ప్రమాదం: బైక్ అదుపుతప్పి కింద పడిపోవడంతో తేజస్విని తలకు తీవ్ర...