🎤భారత్ ఆవాజ్ న్యూస్, ఆసిఫాబాద్: హైదరాబాద్ శంషాబాద్ పరిధిలో ఆదివాసీ నర్సు శిరీషపై జరిగిన ఘోర హత్యాచారాన్ని నిరసిస్తూ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో భారీ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుందెబ్బ) ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన ప్రదర్శన కొమురం భీం విగ్రహం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు కొనసాగింది. ఈ సందర్భంగా వందలాది మంది విద్యార్థులు, నర్సులు బాధిత యువతికి ఘన నివాళులర్పించారు....