[31/08, 12:42 pm] Kumar: హైదరాబాద్ లో నేటి నుంచి అందుబాటులోకి రానున్న భారీ హైలెవెల్ బ్రిడ్జి- ట్రాఫిక్ కు చెక్
[31/08, 12:42 pm] Kumar: హైదరాబాద్ లో నానాటికీ పెరుగుతున్న ట్రాఫిక్ కష్టాలను తీర్చడానికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చేపట్టిన ఫ్లైఓవర్లు, బ్రిడ్జిలు తుది దశకు చేరుకున్నాయి. నిత్యం ట్రాఫిక్ ఇబ్బందులతో సతమతమవుతున్న వాహనదారులకు భారీ ఉపశమనం లభించనుంది. మూసీ నదిపై నిర్మించిన నూతన మూసారాంబాగ్‌ హైలెవల్ బ్రిడ్జి నేడు అందుబాటులోకి రాబోతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు.
[31/08, 12:42 pm] Kumar: బ్రిడ్జి అందుబాటులోకి రానుండటంతో అంబర్‌పేట్, మూసారాంబాగ్‌ పరిసర ప్రాంతాల మధ్య వాహనాల రాకపోకలు మరింత సజావుగా సాగే అవకాశం ఉంది. ప్రయాణ సమయం భారీగా తగ్గుతుంది. సుమారు రూ. 52 కోట్ల అంచనా వ్యయంతో జీహెచ్ఎంసీ దీన్ని పూర్తి చేసింది. ఇప్పటి వరకు ఈ మార్గంలో ప్రయాణించాలంటే నరకప్రాయంగా ఉండేది. పీక్ అవర్స్‌లో ఎదురయ్యే ట్రాఫిక్ జాం సమస్యలకు ఇది శాశ్వత పరిష్కారాన్ని చూపుతుందని వాహనదారులు ఆశిస్తోన్నారు.
[31/08, 12:43 pm] Kumar: ప్రారంభోత్సవ ఏర్పాట్లలో భాగంగా జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్ వీ కర్ణన్ అధికారులతో కలిసి వంతెన పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వాహనాల రద్దీ అవసరాలకు అనుగుణంగా ఈ బ్రిడ్జికి రూపకల్పన చేసింది.. జీహెచ్‌ఎంసీ. దీని మొత్తం పొడవు 400 మీటర్లు. వెడల్పు 14.5 మీటర్లు. ఇరువైపుల నుంచి రాకపోకలు సాగించవచ్చు. పాదాచారుల కోసం మూసారాంబాగ్ వంతెనకు ఇరువైపులా 3.5 మీటర్ల వెడల్పుతో ఫుట్‌పాత్‌లను నిర్మించారు.
[31/08, 12:43 pm] Kumar: వర్షాకాలంలో మూసీ నది ఉప్పొంగిన తరుణంలో పాత మూసారాంబాగ్‌ కాజ్‌వే పూర్తిగా నీట మునిగిపోయేదనే విషయం తెలిసిందే. ఆ సమయంలో అంబర్‌పేట, మలక్‌పేట, దిల్‍సుఖ్ నగర్, గోల్నాక మధ్య రవాణా పూర్తిగా స్తంభించిపోయేది. భద్రతా కారణాల దృష్ట్యా పోలీసులు ఈ మార్గంలో నిత్యం రాకపోకలను నిలిపివేయాల్సిన పరిస్థితి వచ్చేది. ఫలితంగా వేలాది మంది వాహనదారులు కిలోమీటర్ల మేర చుట్టూ తిరిగి ప్రయాణించేవారు.
[31/08, 12:43 pm] Kumar: నూతన హైలెవెల్ వంతెన అందుబాటులోకి వస్తోండటంతో ఈ ఇబ్బందులు తప్పినట్టవుతుంది. భవిష్యత్తులో మూసీ నదికి ఎంతటి వరదలు వచ్చినప్పటికీ వాహనాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండేలా దీన్ని నిర్మించారు. నది ప్రవాహ స్థాయి కంటే చాలా ఎత్తులో ఈ వంతెనను నిర్మించడం దీనికి ప్రధాన కారణం.
[31/08, 12:42 pm] Kumar: హైదరాబాద్ లో నేటి నుంచి అందుబాటులోకి రానున్న భారీ హైలెవెల్ బ్రిడ్జి- ట్రాఫిక్ కు చెక్ [31/08, 12:42 pm] Kumar: హైదరాబాద్ లో నానాటికీ పెరుగుతున్న ట్రాఫిక్ కష్టాలను తీర్చడానికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చేపట్టిన ఫ్లైఓవర్లు, బ్రిడ్జిలు తుది దశకు చేరుకున్నాయి. నిత్యం ట్రాఫిక్ ఇబ్బందులతో సతమతమవుతున్న వాహనదారులకు భారీ ఉపశమనం లభించనుంది. మూసీ నదిపై నిర్మించిన నూతన మూసారాంబాగ్‌ హైలెవల్ బ్రిడ్జి నేడు అందుబాటులోకి రాబోతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. [31/08, 12:42 pm] Kumar: బ్రిడ్జి అందుబాటులోకి రానుండటంతో అంబర్‌పేట్, మూసారాంబాగ్‌ పరిసర ప్రాంతాల మధ్య వాహనాల రాకపోకలు మరింత సజావుగా సాగే అవకాశం ఉంది. ప్రయాణ సమయం భారీగా తగ్గుతుంది. సుమారు రూ. 52 కోట్ల అంచనా వ్యయంతో జీహెచ్ఎంసీ దీన్ని పూర్తి చేసింది. ఇప్పటి వరకు ఈ మార్గంలో ప్రయాణించాలంటే నరకప్రాయంగా ఉండేది. పీక్ అవర్స్‌లో ఎదురయ్యే ట్రాఫిక్ జాం సమస్యలకు ఇది శాశ్వత పరిష్కారాన్ని చూపుతుందని వాహనదారులు ఆశిస్తోన్నారు. [31/08, 12:43 pm] Kumar: ప్రారంభోత్సవ ఏర్పాట్లలో భాగంగా జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్ వీ కర్ణన్ అధికారులతో కలిసి వంతెన పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వాహనాల రద్దీ అవసరాలకు అనుగుణంగా ఈ బ్రిడ్జికి రూపకల్పన చేసింది.. జీహెచ్‌ఎంసీ. దీని మొత్తం పొడవు 400 మీటర్లు. వెడల్పు 14.5 మీటర్లు. ఇరువైపుల నుంచి రాకపోకలు సాగించవచ్చు. పాదాచారుల కోసం మూసారాంబాగ్ వంతెనకు ఇరువైపులా 3.5 మీటర్ల వెడల్పుతో ఫుట్‌పాత్‌లను నిర్మించారు. [31/08, 12:43 pm] Kumar: వర్షాకాలంలో మూసీ నది ఉప్పొంగిన తరుణంలో పాత మూసారాంబాగ్‌ కాజ్‌వే పూర్తిగా నీట మునిగిపోయేదనే విషయం తెలిసిందే. ఆ సమయంలో అంబర్‌పేట, మలక్‌పేట, దిల్‍సుఖ్ నగర్, గోల్నాక మధ్య రవాణా పూర్తిగా స్తంభించిపోయేది. భద్రతా కారణాల దృష్ట్యా పోలీసులు ఈ మార్గంలో నిత్యం రాకపోకలను నిలిపివేయాల్సిన పరిస్థితి వచ్చేది. ఫలితంగా వేలాది మంది వాహనదారులు కిలోమీటర్ల మేర చుట్టూ తిరిగి ప్రయాణించేవారు. [31/08, 12:43 pm] Kumar: నూతన హైలెవెల్ వంతెన అందుబాటులోకి వస్తోండటంతో ఈ ఇబ్బందులు తప్పినట్టవుతుంది. భవిష్యత్తులో మూసీ నదికి ఎంతటి వరదలు వచ్చినప్పటికీ వాహనాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండేలా దీన్ని నిర్మించారు. నది ప్రవాహ స్థాయి కంటే చాలా ఎత్తులో ఈ వంతెనను నిర్మించడం దీనికి ప్రధాన కారణం.
0 Comments 0 Shares 237 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com