Bharat Aawaz
ఓనం పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

కేరళం సాంస్కృతిక వారసత్వం, సంప్రదాయాలను ప్రతిబింబించే ఓనం వేడుకలు.. కళారూపాలు, ఆచార సంప్రదాయాలతో భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతిరూపంగా నిలుస్తాయని ముఖ్యమంత్రి గారు పేర్కొన్నారు. ప్రకృతికి కృతజ్ఞత, సోదరభావం, కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఆత్మీయులతో కలిసి ఆనందాన్ని పంచుకునే స్ఫూర్తిని ఓనం చాటుతుందని అన్నారు.

ఓనం పర్వదినం ప్రతి ఇంటా ఆనందం, శాంతి, సౌభాగ్యాలను నింపాలని.. ఐక్యత, సోదరభావనను మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు.
157 Views