శాసనసభ వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్ 7వ తేదీ నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రజాప్రతినిధులకు వివరించారు.


✳️ బ్రిటన్ పర్యటనను విజయవంతంగా ముగించుకుని తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి గారు అందుబాటులో ఉన్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సమావేశమయ్యారు.


✳️ ప్రజాప్రతినిధులందరూ నియోజకవర్గాల అభివృద్ధిపై ఫోకస్ పెంచాలని ఈ సందర్భంగా సూచించారు. ప్రధానంగా అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన పెండింగ్ భూసేకరణ పనులు వేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.


✳️ భూసేకరణపై నిర్లక్ష్యం వహిస్తే ప్రాజెక్టులు ఎప్పటికీ పూర్తి కావని, భూసేకరణ, ఆర్ అండ్ ఆర్, అటవీ అనుమతులకు సంబంధించి నిధులను వెంటనే మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు.


✳️ ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు, మంత్రులు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, తుమ్మల నాగేశ్వర్ రావు గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, ధనసరి అనసూయ సీతక్క గారు, ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్ గారు, రామచంద్ర నాయక్ గారు, బీర్ల ఐలయ్య గారు, వేముల వీరేశం గారు పాల్గొన్నారు.


✳️ ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్ గారు, వేం నరేందర్ రెడ్డి గారు, కడియం కావ్య గారు, రఘువీర్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య గారు హాజరయ్యారు.
శాసనసభ వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్ 7వ తేదీ నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రజాప్రతినిధులకు వివరించారు. ✳️ బ్రిటన్ పర్యటనను విజయవంతంగా ముగించుకుని తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి గారు అందుబాటులో ఉన్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సమావేశమయ్యారు. ✳️ ప్రజాప్రతినిధులందరూ నియోజకవర్గాల అభివృద్ధిపై ఫోకస్ పెంచాలని ఈ సందర్భంగా సూచించారు. ప్రధానంగా అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన పెండింగ్ భూసేకరణ పనులు వేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ✳️ భూసేకరణపై నిర్లక్ష్యం వహిస్తే ప్రాజెక్టులు ఎప్పటికీ పూర్తి కావని, భూసేకరణ, ఆర్ అండ్ ఆర్, అటవీ అనుమతులకు సంబంధించి నిధులను వెంటనే మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ✳️ ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు, మంత్రులు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, తుమ్మల నాగేశ్వర్ రావు గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, ధనసరి అనసూయ సీతక్క గారు, ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్ గారు, రామచంద్ర నాయక్ గారు, బీర్ల ఐలయ్య గారు, వేముల వీరేశం గారు పాల్గొన్నారు. ✳️ ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్ గారు, వేం నరేందర్ రెడ్డి గారు, కడియం కావ్య గారు, రఘువీర్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య గారు హాజరయ్యారు.
0 Comments 0 Shares 135 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com